Baby Drowned In Bucket : ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడ్డాడు.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 09:11 AM
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూం బకెట్‌లో పడిన చిన్నారి బాలుడు..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయసున్న ఒక చిన్నారి ఆడుకుంటూ బాత్రూం బకెట్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అసలేం జరిగిందంటే..
షానవాజ్ కుమారుడు అలీషాన్ ఇంట్లో ఆడుకుంటూ ఉండగా కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు గంటల తరబడి వెతికినా ఎక్కడా దొరకలేదు. చివరకు ఇంట్లోని బాత్రూం బకెట్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడు. అప్పటికే అతను ఊపిరి ఆడక మృతి చెందాడు. ఈ సంఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చిన్నారి తండ్రి షానవాజ్ కర్ణాటకలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లై రెండేళ్లు మాత్రమే కాగా, అలీషాన్ అతని ఏకైక సంతానం. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామమంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News