Zomato Healthy Mode: జొమాటోలో హెల్దీ మోడ్ ఫీచర్
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:33 AM
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమా టో.. వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని గుర్తిం చి సులభంగా ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా తన యాప్‌లో కొత్త ‘హెల్దీ మోడ్’...
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమా టో.. వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని గుర్తిం చి సులభంగా ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా తన యాప్‌లో కొత్త ‘హెల్దీ మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం రెస్టారెంట్ భాగస్వాముల సహకారంతో.. ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎమ్) వంటి సాంకేతికతలను ఉపయోగించి వంటకాలకు సంబంధించిన మాక్రో న్యూట్రియెంట్ ప్రొఫైల్స్‌ను రూపొందించిన ట్లు తెలిపింది. ప్రతి వంటకానికి పోషక విలువలు ఆధారంగా ‘తక్కువ’ నుంచి ‘సూపర్’ వరకు ‘హెల్దీ స్కోర్’ను కేటాయించింది. కాగా ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ గురుగ్రామ్‌లోని కస్టమర్లకు అందుబాటులో ఉండగా, త్వరలో దేశవ్యాప్తంగా దీనిని విస్తరించనున్నట్లు జొమాటో తెలిపింది.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి