World Bank: పేదరిక అంచనాల పెరుగుదల..ప్రపంచ బ్యాంకు కీలక మార్పులు
ABN , Publish Date - Jun 06 , 2025 | 07:51 PM
ప్రపంచ బ్యాంక్ (World Bank) తీవ్ర పేదరికానికి సంబంధించి కీలక విషయాలపై ఓ నివేదిక ఇచ్చింది. దీనిలో అతి పేదరికం స్థాయిని పెంచడంతోపాటు పలు అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా పేదరికం గురించి ప్రపంచ బ్యాంక్ (World Bank) కీలక మార్పులను ప్రకటించింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ అతి పేదరికం స్థాయిని తాజాగా కొంత పైపైకి తీసుకెళ్లింది. దిగువ ఆదాయం ఉన్న దేశాల (low-income countries) రేఖను రోజుకు 2.15 అమెరికన్ డాలర్ల నుంచి 3 డాలర్లకు పెంచింది. మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల (lower-middle-income countries) రేఖ 3.65 డాలర్ల నుంచి 4.20 డాలర్లకు పెరిగింది. అలాగే, ఉన్నత-మధ్య స్థాయి ఆదాయ దేశాల (upper-middle-income countries) అంకె 6.85 డాలర్ల నుంచి 8.40 డాలర్లకు చేరింది.
నిజమైన స్థాయి మాత్రం..
ప్రపంచ బ్యాంక్ తెలిపినట్లుగా దీనిని పెంచినప్పటికీ, ఇది ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఉన్న అతి పేదరిక అవసరాలను తీరుస్తుందని వెల్లడించింది. ఈ కొత్త మార్పు మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పేదరిక సమస్యల నిజమైన స్థాయిని పూర్తిగా ప్రతిబింబించలేదని కూడా ప్రస్తావించింది. ప్రపంచ బ్యాంక్ అతి పేదరిక స్థాయిని అంచనా వేయడానికి 1990 నుంచి ఒక స్థిరమైన పద్ధతిని అనుసరిస్తోంది. 2001లో మొదటిసారి ఈ అతి పేదరిక రేఖను అప్‌డేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 2008, 2015, 2022లో పునర్నిర్దేశం చేసింది.
అంచనా వేయడంలో మార్పులు
ప్రపంచ బ్యాంక్ ప్రకారం 1990 నుంచి ప్రపంచంలో 1.5 బిలియన్ (150 కోట్ల) మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చాలా పెద్ద విజయని చెప్పుకోవచ్చు. కానీ గతంలో మాంద్యం సహా అనేక అంశాలు పేదరికంపై ప్రభావం చూపించాయి. అనేక దేశాల అధిక రుణభారం, యుద్ధాలు, వివాదాలు, బంగారం, వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించే ప్రక్రియ పడిపోయింది.
ఇండియాలో మాత్రం..
ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం, ఇప్పటికీ 808 మిలియన్ల మంది అతి పేదరికంలో జీవిస్తున్నారు. ఈ స్థితి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉంది. 808 మిలియన్ల మంది ప్రధానంగా ఆఫ్రికన్, ఆసియా దేశాలలో ఉన్నారని నివేదిక తెలిపింది. ప్రస్తుత వృద్ధి రేటును బట్టి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఇంకా అనేక దశాబ్దాలు పడతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. భారతదేశం ఈ విషయంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. భారతదేశం 2011-12 నుంచి 2022-23 మధ్య అతి పేదరికం నుంచి 171 మిలియన్ల మందిని బయటపడేలా చేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, భారతదేశం తక్కువ మధ్యస్థాయి ఆదాయ దేశం (lower-middle-income category)గా ఉంది.
ఇవీ చదవండి:
భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..