Share News

RBI Repo Rate: మరో పావు శాతం రెపో కోత

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:52 AM

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నేటి నుంచి మూడు రోజుల పా టు భేటీ అవుతోంది. వచ్చే రెండు నెలల పాటు అమలులో ఉండే ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానాన్ని బుధవారం మల్హోత్రా...

RBI Repo Rate: మరో పావు శాతం రెపో కోత

  • ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా

  • నేటి నుంచి ద్రవ్య విధాన కమిటీ భేటీ

  • బుధవారం ఆర్‌బీఐ పాలసీ

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నేటి నుంచి మూడు రోజుల పా టు భేటీ అవుతోంది. వచ్చే రెండు నెలల పాటు అమలులో ఉండే ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానాన్ని బుధవారం మల్హోత్రా ప్రకటించనున్నారు. అయితే ఈ సారి కూడా కీలక రెపోరేటును ఎంపీసీ యథాతథంగా ప్రస్తుత 5.5 శాతం వద్దే ఉంచుతుందా లేక మరో పావు శాతం తగ్గిస్తుందా అనే అంశంపై ఆర్థిక నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎస్‌బీఐ రీసెర్చి మాత్రం రెపోరేటును ప్రస్తుత 5.5 శాతం నుంచి 5.25 శాతానికి కుదించే అవకాశం ఉందని అంచనా వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 4ు కన్నా దిగువనే ఉండడం ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తుందని తెలిపింది. క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మళ్లీ యథాతథ స్థితే !

రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ ఈ సారి కూడా రెపోరేటును యథాతథంగా 5.5 శాతం వద్ద కొనసాగించే అవకాశమే ఎక్కువనే వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ట్రంప్‌ సుంకాల ప్రభావంపై ఇంకా ఒక అంచనాకు రాలేకపోవడం ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ‘అక్టోబరు 1న వెలువడే భేటీలోనూ ఎంపీసీ రెపోరేటులో మార్పులు చేసే అవకాశం తక్కువ. ప్రస్తుతం అంత అవసరం సైతం లేదు’ అని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్‌ సబ్నవిస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎ్‌సటీ 2.0 నేపథ్యంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెద్దగా పెరిగే ప్రమాదం లేకపోవడం, జీడీపీ వృద్ధి రేటుకూఢోకా లేకపోవడం కూడా ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 01:52 AM