Share News

Income Tax Refund: ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:27 AM

ఈ నెల 16తో ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్‌ల ఫైలింగ్‌ ముగిసింది. దాదాపు ఏడు కోట్ల మందికిపైగా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేశారు. వీరిలో చాలా మంది రిఫండ్స్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్‌-జూలైలో రిటర్న్‌ ఫైల్‌ చేసినా...

Income Tax Refund: ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా

అయితే వీటిని ఓసారి పరిశీలించండి..

ఈ నెల 16తో ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్‌ల ఫైలింగ్‌ ముగిసింది. దాదాపు ఏడు కోట్ల మందికిపైగా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేశారు. వీరిలో చాలా మంది రిఫండ్స్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్‌-జూలైలో రిటర్న్‌ ఫైల్‌ చేసినా ఇంకా మాకు రిఫండ్‌ అందలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. మరోపక్క ఐటీ రిటర్న్‌ల ప్రాసెసింగ్‌, ఈ-వెరిఫికేషన్‌ శరవేగంగా చేస్తున్నట్టు ఐటీ శాఖ చెబుతోంది. అయినా రిఫండ్స్‌ ఎందుకు ఆలస్యమవుతున్నాయో తెలుసుకుందాం.

ఆలస్యానికి కారణాలు

ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసి ఈ-వెరిఫికేషన్‌ పూర్తయిన నాలుగు నుంచి ఐదు వారాల్లో రిఫండ్‌ మొత్తం ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో పడాలి. ఈ గడువులోగా రిఫండ్‌ రాకపోతే ఈ కింది విషయాలు కారణమై ఉంటాయి. అవేమిటంటే..

  • ఐటీ శాఖ వద్ద ఉండే టాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ (టీఐఎస్‌), యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ (ఏఐఎస్‌), ఫామ్‌ 26ఏఎ్‌సలోని సమాచారానికి, ఫైల్‌ చేసిన రిటర్న్‌లోని సమాచారం


మధ్య తేడాలు

  • ఐటీ శాఖ నుంచి ఏమైనా నోటీసులు, రివ్యూల సమాచారం వచ్చినప్పుడు

  • బిజినెస్‌ ఆదాయం, మూలధన లాభాలు, అనేక తగ్గింపులు (డిడక్షన్స్‌) ఉన్నప్పుడు

  • రిఫండ్‌ మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు

  • టీడీఎస్‌ డేటాలో తేడాలు.

  • రిటర్న్‌ల్లోని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు

  • బ్యాంకు ఖాతాను ముందుగా వ్యాలిడేట్‌ చేయకపోవడం

  • బ్యాంకు ఖాతాలోని పేరు, పాన్‌ కార్డుపై ఉన్న పేరులో తేడా

  • తప్పుడు ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఉన్నప్పుడు

  • ఐటీఆర్‌లో పేర్కొన్న బ్యాంకు ఖాతా క్లోజ్‌ చేసినప్పుడు

  • పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోవటం

ఐటీఆర్‌ స్టేటస్‌ రకాలు

సబ్‌మిటెడ్‌ అండ్‌ పెండింగ్‌ ఫర్‌ ఈ-వెరిఫికేషన్‌ అని వస్తే: రిటర్న్‌ ఫైల్‌ చేసినా ఈ-వెరిఫికేషన్‌ పూర్తి కాకపోవడం లేదా సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)కు వెరిఫై చేసిన మీ రిటర్న్‌ ఇంకా అందలేదని అర్థం.

సక్సె్‌సఫుల్లీ ఈ-వెరిఫైడ్‌ అని వస్తే: మీ రిటర్న్‌ ఈ-వెరిఫై చేయబడింది. అయితే రిటర్న్‌లోని విషయాలను ఇంకా ప్రాసెస్‌ చేయలేదు అని అర్థం.

ప్రాసెస్డ్‌: మీరు దాఖలు చేసిన రిటర్న్‌ విజయవంతంగా ప్రాసెస్‌ చేయబడింది అని అర్థం.

డిఫెక్టివ్‌: మీరు ఫైల్‌ చేసిన రిటర్న్‌లో కీలకమైన కొన్ని వివరాలు లేకపోవడం లేదా తేడాలు ఉన్నాయని అర్థం.

ఇలాంటి సందర్భాల్లో నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ లోపాలను సవరించి మళ్లీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలని ఐటీ శాఖ సెక్షన్‌ 139 (9) కింద నోటీసులు జారీ చేస్తుంది. ఆ నోటీసులకు స్పందించకపోతే మీ ఐటీ రిటర్న్‌ను చెల్లనిదిగా భావించి ప్రాసెస్‌ చేయరు.


కేసు ట్రాన్స్‌ఫర్డ్‌ టు అసెసింగ్‌

ఆఫీసర్‌: మీ రిటర్న్‌లోని కొన్ని విషయా ల్లో ఏమైనా తీవ్రమైన తేడాలు ఉంటే సీపీసీ ఆ రిటర్న్‌లు అసెసింగ్‌ అధికారికి బదిలీ చేస్తుంది. అప్పుడు అసెసింగ్‌ అధికారి అడిగిన వివరాలు సబ్‌మిట్‌ చేస్తే సరిపోతుంది.

చెక్‌ చేయడం ఎలా?

మన రిఫండ్‌ ఎందుకు ఆలస్యమవుతుందనే విషయాన్ని ఈ కింది పద్దతిలో చెక్‌ చేసుకోవచ్చు.

  • పాన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ద్వారా incometax.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. ఇందుకోసం ఇప్పటికే మీ పాన్‌ నంబర్‌ను మీ ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేసి ఉండాలి. ఒకవేళ చేసి ఉండకపోతే, ఇదే వెబ్‌సైట్‌లోని ‘లింక్‌ నౌ’ బటన్‌ ఆప్షన్‌ ద్వారా అనుసంధానించాలి.

  • లాగిన్‌ అయిన తర్వాత టాప్‌ మెనూలో ఉన్న నౌ యువర్‌ రిఫండ్‌ స్టేట్‌సపై క్లిక్‌ చేయాలి.

  • ఇప్పుడు ఈ-ఫైల్‌ ట్యాబ్‌లోకి వెళ్లి ‘ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్న్స్‌’ ట్యాబ్‌ మీద క్లిక్‌ చేసి ‘వ్యూ ఫైల్డ్‌ రిటర్న్ప్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • ఇప్పుడు కోరుకున్న అసె్‌సమెంట్‌ సంవత్సరానికి సంబంధించి మీ రిఫండ్‌ స్టేటస్‌ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 05:27 AM