Share News

స్పాన్సర్‌షిప్‌ సర్వీ్‌సలకు జీఎ్‌సటీ ఎవరు చెల్లించాలి?

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:00 AM

సురభి ఈవెంట్స్‌ అనే సంస్థ ప్రతి సంవత్సరం సినీ రంగానికి సంబంధించి వివిధ విభాగాల కింద అవార్డులు ఇస్తుంది. ఇందులో హీరో, హీరోయిన్‌లు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన సాంకేతిక...

స్పాన్సర్‌షిప్‌ సర్వీ్‌సలకు జీఎ్‌సటీ ఎవరు చెల్లించాలి?

సురభి ఈవెంట్స్‌ అనే సంస్థ ప్రతి సంవత్సరం సినీ రంగానికి సంబంధించి వివిధ విభాగాల కింద అవార్డులు ఇస్తుంది. ఇందులో హీరో, హీరోయిన్‌లు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఉంటారు. సినీ ప్రముఖులు ఉండటంతో ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి జనం ఎక్కువగా హాజరు కావటంతో పాటుగా టీవీలలో ఎక్కువ మంది చూస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేయటానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. తద్వారా తమ ఉత్పత్తులకు మంచి ప్రమోషన్‌, బ్రాండింగ్‌ లభిస్తుంది కాబట్టి. ఇందులో భాగంగా ఆయా కంపెనీలకు సంబంధించిన బ్యానర్స్‌ను లోగోలను కార్యక్రమంలో ప్రదర్శించటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా సంస్థలు కొంత మొత్తాన్ని సురభి ఈవెంట్స్‌కు చెల్లించటం జరుగుతుంది. ఈ వెంట్‌ ఆధారంగా చేసుకుని తమ బ్రాండ్‌ లేదా కంపెనీని ప్రమోట్‌ చేసుకునే అవకాశం సదరు సంస్థలకు సురభి ఈవెంట్స్‌ కల్పిస్తుంది. దీనినే స్పాన్సర్‌షిప్‌ సర్వీస్‌ అంటారు. మరి ఈ స్పాన్సర్‌షిప్‌ సర్వీ్‌సలకు సంబంధించి తీసుకున్న మొత్తం మీద పన్ను ఎవరు చెల్లించాలి?


స్పాన్సర్‌షి్‌పలను జీఎ్‌సటీలో రివర్స్‌ చార్జ్‌ మెకానిజం కిందకు తీసుకువచ్చారు? అంటే, ఈ సర్వీస్‌ అందుకున్న వారు ‘బాడీ కార్పొరేట్‌’ లేదా ‘పార్ట్‌నర్‌షిప్‌’ విభాగంలోకి వచ్చేటట్లయితే, చెల్లించిన మొత్తం మీద పన్ను వారే చెల్లించాలి. అంటే ఇక్కడ సురభి ఈవెంట్స్‌కు స్పాన్సర్‌షిప్‌ ద్వారా పొందిన మొత్తం మీద పన్నుకు సంబంధించి ఎలాంటి బాధ్యత ఉండదు. అయితే, దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో ఒక సవరణ చేయటంజరిగింది.

దీని ప్రకారం ఈవెంట్స్‌ నిర్వాహకులు.. బాడీ కార్పొరేట్‌ కింద నమోదైతే అప్పుడు సర్వీస్‌ అందుకునే వారి స్థితితో సంబంధం లేకుండా ఈవెంట్స్‌ నిర్వాహకులే పన్ను చెల్లించాలి. అంటే, అప్పుడు రివర్స్‌ చార్జ్‌ మెకానిజం అమలు కాదు.


అలాగే ఈ మధ్య పెళ్లిళ్ల దగ్గర నుంచి చిన్నచిన్న కార్యక్రమాలను కూడా ఈవెంట్స్‌ వారికి ఇస్తున్నారు. ఇక్కడ రివర్స్‌ చార్జ్‌ మెకానిజం అమలు కాదు. ఎందుకంటే, నిర్వహణ బాధ్యత ఈవెంట్స్‌ సంస్థే చూసినప్పటికీ, ఇక్కడ ఎలాంటి ‘స్పాన్సర్‌షిప్‌ సర్వీస్‌’ అందించటం లేదు. కాబట్టి దీనికి సంబంధించి వసూలు చేసిన మొత్తం మీద సంబంధిత పన్నును ఈవెంట్స్‌ నిర్వాహకులే చెల్లించాలి. ఈ ఈవెంట్స్‌కు సంబంధించి కొనుగోలు చేసిన సామాగ్రి మీద లేదా పొందిన సర్వీసుల మీద సదరు ఈవెంట్స్‌ సంస్థ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకోవచ్చు. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సర్వీస్‌ అనేది రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చినప్పుడు తీసుకున్న క్రెడిట్‌ను.. దామాషా పద్దతిలో రివర్స్‌ చేయాలి.


ఉదాహరణకు ఇదే సురభి ఈవెంట్స్‌ ఒక నెలలో ఒక పెళ్లికి సంబంధించిన ఈవెంట్‌ నిర్వహించింది. దీనికి గాను ఒక రూ.30 లక్షలు పొందిందనుకుందాం. అలాగే అదె నెలలోనే పైన చెప్పిన అవార్డుల ఫంక్షన్‌ నిర్వహించింది. దీనికి గాను రూ.20 లక్షలు స్పాన్సర్‌షిప్‌ సర్వీస్‌ కింద వివిధ కంపెనీల నుంచి పొందటం జరిగింది. అంటే, ఆ నెలలో జరిగిన మొత్తం సర్వీస్‌ రూ.50 లక్షల్లో.. రూ.20 లక్షలు అంటే 40 శాతం రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలో వస్తుంది (సురభి ఈవెంట్స్‌ అనేది ఒక పార్ట్‌నర్‌షిప్‌ ఫర్మ్‌ అనుకుంటే). కాబట్టి ఆ నెలలో పొందే ఐటీసీలో 40 శాతం రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇలా దామాషా పద్దతిలో క్రెడిట్‌ రివర్స్‌ చేయటం అనేది కేవలం స్పాన్సర్‌షిప్‌ సర్వీ్‌సకు మాత్రమే కాకుండా రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలోకి వచ్చే అన్ని సరఫరాలకు వర్తిస్తుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.



ఇవి కూడా చదవండి:

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 23 , 2025 | 03:00 AM