Weekly Stock Market Outlook: అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:20 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశం ఉంది. ఇప్పటికే కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలైంది. జీఎ్‌సటీ తగ్గటం, కొనుగోళ్లు పెరగటంతో కంపెనీల మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశం ఉంది. ఇప్పటికే కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలైంది. జీఎ్‌సటీ తగ్గటం, కొనుగోళ్లు పెరగటంతో కంపెనీల మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే జియో పొలిటికల్ పరిణామాలపై ఓ కన్నేయటం మంచి ది. ఎంపిక చేసుకున్న స్టాక్స్‌లోనే ట్రేడింగ్ చేయాలి. నిఫ్టీ 25,700 ఎగువన నిలదొక్కుకుంటే మూమెంటమ్ మరింత బలపడుతుంది. ప్రస్తుతం ఆటో, మెటల్స్, డిఫెన్స్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
పిడిలైట్: రెండేళ్లుగా ఎలాంటి రిటర్న్ ఇవ్వని ఈ షేరు ప్రస్తుతం పుంజుకుంటోంది. ఫిబ్రవరి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం కన్సాలిడేషన్ జరుగుతోంది. గత శుక్రవారం రూ.1,542 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,520 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,660 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,490 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐటీసీ: ప్రస్తుతం ఈ షేరు కనిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. జీఎ్‌సటీ సంస్కరణల నేపథ్యంలో లాభదాయకత పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గత శుక్రవారం రూ.412 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.410 శ్రేణిలో ప్రవేశించి రూ.470 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.395 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బెర్జర్ పెయింట్స్: కొన్ని నెలల పతనం తర్వాత పుంజుకున్న ఈ షేరు ప్రస్తుతం దిద్దుబాటు దశలో ఉంది. స్వల్పకాలిక మూమెంటమ్ బలపడుతోంది. పండగల నేపథ్యంలో లాభదాయకత పెరగవచ్చు. గత శుక్రవారం రూ.544 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.525 స్థాయిలో ప్రవేశించి రూ.650 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.505 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మహీంద్రా ఫైనాన్స్: రెండేళ్లుగా రేంజ్ బౌండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం అప్‌ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది. మూమెంటమ్, డెలివరీ పెరిగాయి. బుల్లి్‌షనెస్ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.300 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.280 పై స్థాయిలో ప్రవేశించి రూ.355 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మారికో: గడిచిన ఏడాది కాలంలో 10 శాతం రిటర్న్ ఇచ్చిన ఈ కౌంటర్‌లో మూమెంటమ్ బలపడుతోంది. ఈ షేరు మరింత పెరిగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.735 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.725పై స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.840 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.705 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News