Share News

Stock Market Volatility: ఆటుపోట్లకు అవకాశం

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:45 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. ఇప్పటికే ఏడు వరుస సెషన్లలో ప్రధాన సూచీలు పతనమవుతూ వచ్చాయి. ఒకవైపు ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనలు, మరోవైపు ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతుండడం...

Stock Market Volatility: ఆటుపోట్లకు అవకాశం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశముంది. ఇప్పటికే ఏడు వరుస సెషన్లలో ప్రధాన సూచీలు పతనమవుతూ వచ్చాయి. ఒకవైపు ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనలు, మరోవైపు ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతుండడం, భౌగోళిక-రాజకీయ పరిణామాలు ఇందుకు కారణం. సానుకూల సెంటిమెంట్‌ నెలకొంటే మళ్లీ కొనుగోళ్లు పెరగొచ్చు. ప్రస్తుతం నాన్‌ ఫెర్రస్‌ మెటల్స్‌, ఐరన్‌ అండ్‌ స్టీల్‌, ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్‌, పవర్‌ సెక్టార్లో కాస్త మూమెంటమ్‌ కనిపిస్తోంది.

స్టాక్‌ రికమెండేషన్స్‌

గోద్రేజ్‌ ఆగ్రో: ఈ ఏడాది జూలై నుంచి ఈ షేర్‌ డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తూ మరోసారి కీలక మద్దతు స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం 4.09ు లాభంతో రూ.715 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు స్వల్పకాల వ్యూహంతో రూ.700పై స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. రూ.825 టార్గెట్‌ పెట్టుకోవాలి. స్టాప్‌లాస్‌ :రూ.675.

టీవీఎస్‌ మోటార్స్‌: కొన్ని నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం పుల్‌బ్యాక్‌ అయింది. కీలక 20 ఈఎమ్‌ఏ వద్ద కదలాడుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. ఈ సెక్టార్‌పై సానుకూల ప్రభావం ఉంది. గత శుక్రవారం రూ.3,414 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.3,550 టార్గెట్‌ ధరతో రూ.3,400 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.3,370.

మ్యాక్స్‌ హెల్త్‌: జీవితకాల గరిష్టానికి చేరాక ఈ షేర్లలో దిద్దుబాటు మొదలై ఇప్పటికే 15ు మేర పతనమైంది. పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ పుంజుకోవచ్చు. గత శుక్రవారం రూ.1123 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు స్వింగ్‌ ట్రేడ్‌ చేయొచ్చు. రూ.1250/1300 టార్గెట్‌ ధరతో రూ.1100 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ. 1070.

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌: కొన్ని నెలలుగా సైడ్‌వేస్‌లో చలిస్తున్న ఈ షేర్లలో రిలెటివ్‌ స్ట్రెంత్‌ పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.279 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.340 టార్గెట్‌ ధరతో రూ.270 స్థాయిలో ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.250.

ఏయూ బ్యాంకు: జూలై నుంచి క్రమంగా దిద్దుబాటుకు లోనైన ఈ షేర్లు ప్రస్తుతం పుంజుకుంటున్నాయి. రిలెటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.743 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.840 టార్గెట్‌ ధరతో రూ.740/720 శ్రేణిలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ. 700.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 01:45 AM