బజాజ్ కన్స్యూమర్ చేతికి విశాల్ పర్సనల్ కేర్
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:20 AM
హైదరాబాద్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ విశాల్ పర్సనల్ కేర్‌లో 100 శాతం వాటాలను రూ.120 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు బజాజ్ కన్స్యూమర్ కేర్ ప్రకటించింది. రెండు విడతల్లో...

డీల్ విలువ రూ.120 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ విశాల్ పర్సనల్ కేర్‌లో 100 శాతం వాటాలను రూ.120 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు బజాజ్ కన్స్యూమర్ కేర్ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ వాటాలను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. తొలుత 49 శాతం వాటా, అనంతరం మిగిలిన 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది. 1991లో కార్యకలాపాలు ప్రారంభించిన విశాల్ పర్సనల్ కేర్‌కు ఉన్న విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా దక్షిణాది మార్కెట్లో తమ ఉత్పత్తులను మరింత చేరువ చేసే అవకాశం లభించనుందని బజాజ్ కన్స్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది తెలిపారు. అలాగే, విశాల్ పర్సనల్ కేర్‌కు చెందిన హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఉత్పత్తుల బ్రాండ్ ‘బంజారా్‌స’ను ఉత్తరాది మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, బజాజ్ కన్స్యూమర్ కేర్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌గా బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఉంది. అలాగే ఫేషియల్ కిట్స్, హెర్బల్ పౌడర్స్, అలోవేరా జెల్స్, షాంపూలు, హెయిర్‌కేర్ పౌడర్స్ సహా పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..