Share News

US Layoffs: అమెరికాలో 54 శాతం మేర పెరిగిన ఉద్యోగాల కోతలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 02:36 PM

అమెరికాలో జనాలు భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ ఉద్యోగాలను కోల్పోయిన వారి సంఖ్య 54 శాతం మేర పెరిగింది.

US Layoffs: అమెరికాలో 54 శాతం మేర పెరిగిన ఉద్యోగాల కోతలు
US Layoffs 2025

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో లేఆఫ్స్ భారీ స్థాయిలో పెరిగాయి. కరోనా సంక్షోభం తరువాత అత్యధిక స్థాయిలో కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది జనవరి మొదలు నవంబర్ వరకూ మొత్తం 11,70,821 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 54 శాతం అధికం. అక్టోబర్‌లో 1,53,074 మంది ఉద్యోగాలు కోల్పోగా నవంబర్‌లో 71,321 మంది లేఆఫ్స్‌కు గురి కావాల్సి వచ్చింది (US Layoffs 2025).

అమెరికా మీడియా కథనాల ప్రకారం, టెక్నాలజీ, టెలికమ్, రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత పడుతోంది. నవంబర్‌లో టెలికం సంస్థలు 15,139 మందిని తొలగించాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, హెచ్‌పీ వంటి టెక్ సంస్థలు తమ క్లౌడ్, ఏఐ, కార్పొరేట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను సాగనంపింది. మొత్తం ఊస్టింగ్స్ 30 వేలకు చేరే అవకాశం ఉంది. వీటిలో సుమారు 40 శాతం లేఆఫ్స్ ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో చోటుచేసుకోనున్నాయి.


రిటైల్, వేర్‌హౌసింగ్ విభాగాల్లో కూడా లేఆఫ్స్ నమోదవుతున్నాయి. రిటైల్‌ రంగంలో లేఆఫ్స్ 90 వేలకు చేరుకోగా వేర్‌హౌసింగ్‌లో పరిస్థితి ఈ సంఖ్యను దాటింది. కరోనా సంక్షోభ సమయంలో వేగంగా విస్తరించిన సంస్థల్లో ఈ ఒరవడి ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఏఐ కారణంగా 54 వేల మంది జాబ్స్ కోల్పోయినట్టు అక్కడి మీడియా చెబుతోంది. కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ కారణంగా 1,28,255 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కంపెనీలు, విభాగాలు మూతపడటంతో మరో 1,78,531 మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. డిమాండ్ తక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అంశాల వల్ల సుమారు 2,45,086 ఉద్యోగాలను కోల్పోయారు. ఇక కార్పొరేట్ కంపెనీల్లో అత్యధికంగా యూపీఎస్ సంస్థ ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 48 వేల మందిని తొలగించింది. లేఆఫ్స్ కారణంగా అమెరికన్ కుటుంబాల్లో ఒత్తిడి పెరుగుతోందని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఇవీ చదవండి:

వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 03:09 PM