US Tariffs Impact: భారత వృద్ధికి అమెరికా సుంకాలే పెద్ద ముప్పు క్రిసిల్
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:32 AM
భారత ఆర్థిక వృద్ధికి అమెరికా విధించిన భారీ సుంకాలే పెద్దముప్పుగా పరిణమించే ప్రమాదముందని క్రిసిల్ ఇంటలిజెన్స్...
కోల్‌కతా: భారత ఆర్థిక వృద్ధికి అమెరికా విధించిన భారీ సుంకాలే పెద్దముప్పుగా పరిణమించే ప్రమాదముందని క్రిసిల్ ఇంటలిజెన్స్ హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారి్‌ఫలు.. దేశీయ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు రెండింటిపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక నివేదికలో వెల్లడించింది. అయితే ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా దేశీయ వినియోగం మాత్రం వృద్ధికి తోడ్పాటునందిస్తుందని అంచనా వేసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ వెల్లడించింది.
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి