Share News

Indian Realty Market: అఫర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలకు ట్రంప్‌ గ్రహణం

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:11 AM

భారతీయ ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో దేశంలో అఫర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుంకాలతో చిన్న. మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), వాటి సిబ్బంది...

Indian Realty Market: అఫర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలకు ట్రంప్‌ గ్రహణం

న్యూఢిల్లీ: భారతీయ ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో దేశంలో అఫర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుంకాలతో చిన్న. మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), వాటి సిబ్బంది ఆదాయాలు క్షీణించి అఫర్డబుల్‌ రియల్టీపై ప్రభావం పడుతుందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తెలిపింది. రూ.45 లక్షల లోపు విలువ గల ఇళ్ల కొనుగోలుదారుల్లో అధిక శాతం మంది ఎంఎ్‌సఎంఈ ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు చేసే వారే కావడం ఇందుకు కారణం. అమెరికాకు వస్తు ఎగుమతుల్లో ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తులే అధికంగా ఉంటాయి. వీటిపై అధిక సుంకాలు విధిస్తే మార్కెట్లో వాటి పోటీ సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా వ్యాపార ఆర్డర్లు తగ్గి ఆయా కంపెనీల్లో పని చేసే సిబ్బంది ప్రతికూలంగా ప్రభావితం అవుతారని అనరాక్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ అన్నారు. వాస్తవానికి కొవిడ్‌-19 తర్వాత అఫర్డబుల్‌ ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు కూడా తగ్గిపోయాయి. 2025 ప్రథమార్ధంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలో 1.9 లక్షల ఇళ్లు అమ్ముడుపోగా వాటిలో అఫర్డబుల్‌ ఇళ్లు 34,565 మాత్రమే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 03:11 AM