Share News

US Air Strikes: ముడి చమురు ధరలకు రెక్కలు.. అమెరికా దాడులతో ఆందోళనలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 09:53 AM

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

US Air Strikes: ముడి చమురు ధరలకు రెక్కలు.. అమెరికా దాడులతో ఆందోళనలు
US Iran Strike Oil Prices

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. అణుస్థావరాలపై వైమానిక దాడులతో అమెరికా కూడా రంగంలోకి దిగింది. దీంతో, చమురు ధరలు పతాకస్థాయికి చేరతాయన్న ఆందోళనలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలు జనాలను కలవరపెడుతున్నాయి.

గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో అధిక శాతం హార్ముజ్ జలసంధి మీదుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. అమెరికా దాడుల తరువాత ఈ ప్రాంతంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే అమెరికా సరకు రవాణా నౌకలను టార్గెట్ చేస్తామని హౌతీలు ఇప్పటికే హెచ్చరించారు. ఇటీవల బ్రెండ్ క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) బ్యారెల్ ధర 79 డాలర్లకు చేరి తరువాత మళ్లీ నెమ్మదించింది. అమెరికా దాడుల తరువాత హార్ముజ్ జలసంధిలో సరకు రావాణాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడితే ధరలు 120 నుంచి 130 డాలర్లు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సరకు రావాణ నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చులు రెట్టింపవుతాయి. ముప్పు తగ్గించుకునేందుకు నౌకలను ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించాల్సి రావచ్చు.


యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే ఎస్ అండ్ పీ నాస్‌డాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణికి దిగడంతో అమెరికా డాలర్, బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులకు దిగితే దీని ఫలితాలు రేపటి మార్కెట్ ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ తీరుతెన్నులను అంటుంచితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి విపత్కర పరిస్థితులకు దారి తీయొచ్చని అంటున్నారు.


ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకే ఈ దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు. ఇరాన్‌ను మళ్లీ చర్చలకు లాక్కురావాలన్నదే తమ ఉద్దేమని అన్నారు. మళ్లీ దాడులు చేసేందుకు ఎలాంటి యోచనా లేదని కూడా స్పష్టం చేశారు. అయితే, అమెరికా, మిత్రదేశాల ఆస్తులపై ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడొచ్చన్న భయాల నడుమ ఆయా దేశాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

ఇవీ చదవండి:

ఇరాన్ అణుస్థావరాలపై దాడులు.. ట్రంప్‌పై నెతన్యాహూ ప్రశంసల వర్షం

గాల్లో ఉండగా హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 10:07 AM