Interest Rate Cut, వడ్డీ రేటు 0.25 శాతం తగ్గింపు
ABN , Publish Date - Sep 18 , 2025 | 03:06 AM
అమెరికాలో వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. కీలక స్వల్పకాలిక వడ్డీ రేట్లను అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్లు (0.25ు) తగ్గించింది. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ అధ్యక్షతన....
ప్రకటించిన అమెరికా ఫెడ్ రిజర్వ్
వాషింగ్టన్: అమెరికాలో వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. కీలక స్వల్పకాలిక వడ్డీ రేట్లను అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్లు (0.25ు) తగ్గించింది. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఎఫ్‌ఓఎంసీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వడ్డీ రేటు 4 శాతం నుంచి 4.25 శాతానికి చేరుకుంది. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. కొంత అనిశ్చితి ఉన్నా నిరుద్యోగం, రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వస్తుండడంతో ఫెడ్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం మరో రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించనున్నట్టు పోవెల్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో వడ్డీ రేట్లు తగ్గించండి, లేకపోతే మిమ్మల్ని సాగనంపుతా అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను జెరోమ్ పోవెల్ ఆలకించినట్టయింది.
మార్కెట్లకు బూస్ట్
ఫెడ్ నిర్ణయం వెలువడిన వెంటనే డోజోన్స్ సూచీ 438 పాయింట్లు పెరిగింది. ఫెడ్ తాజా నిర్ణయంతో భారత్‌తో సహా ఇతర వర్థమాన దేశాల స్టాక్ మార్కెట్లకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు మళ్లీ గాడిన పడతాయని భావిస్తున్నారు. గురువారం నుంచి భారత మార్కెట్‌పై ఈ ప్రభావం కనిపిస్తుందని ఽభావిస్తున్నారు. మరోవైపు ఫెడ్ నిర్ణయంతో బులియన్ మార్కెట్ కూడా మరింత పరుగులు తీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుధవారం రాత్రి 11.45 గంటలకు అమెరికా మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర రికార్డు స్థాయిలో 3,731 డాలర్లకు చేరింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి