Budget 2025 : హైస్కూళ్లలో ఇక బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:46 AM
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే.. ‘‘అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు. అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భారతీయ భాష పుస్తకాలకు డిజిటల్ రూపం కల్పిస్తాం. మూడో ప్రాధాన్య రంగంగా పెట్టుబడులు తీసుకొస్తాం. స్కూళ్లలో విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. 2014 తర్వాత ఏర్పాటైన 5 IITలకు మరిన్ని నిధులు సమకూరుస్తాం. గత పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల వైద్య సీట్లు పెంపు. అలాగే రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లను తీసుకొస్తున్నాం’’..
‘‘అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు. పట్టణ పేదలు, వర్తకులకు చేయూత అందిస్తున్నాం. వర్తకులకు రూ.30 వేల పరిమితితో UPI క్రెడిట్ కార్డులు అందించనున్నాం. గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు అందించనున్నాం’’.. అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.