Uncertainty Hits Auto Sales: అనిశ్చితిలో ఆటో అమ్మకాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:23 AM
ప్రతిపాదిత జీఎ్‌సటీ సంస్కరణలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరుతోంది. కార్లపైనా జీఎ్‌సటీ రేట్లు తగ్గుతాయనే వార్తలతో ప్రస్తుతం కొనుగోలుదారులు ఎవరూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని...
బీఎండబ్ల్యూ
ఇండియా సీఈఓ
హర్దీప్ సింగ్ బ్రార్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎ్‌సటీ సంస్కరణలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరుతోంది. కార్లపైనా జీఎ్‌సటీ రేట్లు తగ్గుతాయనే వార్తలతో ప్రస్తుతం కొనుగోలుదారులు ఎవరూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు. ‘కొనుగోలుదారుల ఆసక్తి, డిమాండ్ బాగానే ఉంది. అయితే జీఎ్‌సటీ రేట్లపై సందిగ్దతతో వారు కార్లు కొనకుండా వేచి చూసే వైఖరిలో ఉన్నారు. కొత్త వాహనాల అమ్మకాలపై ఇది కొంత వరకు ప్రభావం చూపిస్తోంది’ అని బ్రార్ తెలిపారు. వచ్చే పండగల సీజన్‌లో వాహనాల అమ్మకాలు పుంజుకోవాలంటే ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్ వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ అమల్లో ఉంది. ఈ నెల 3-4 తేదీల్లో జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశంలో దీన్ని 18 శాతానికి కుదిస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి