Share News

UBS Layoffs: యూబీఎస్‌లో 10000 ఉద్యోగాల కోత

ABN , Publish Date - Dec 08 , 2025 | 02:49 AM

స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉందని సమాచారం. బ్యాంక్‌ మొత్తం...

UBS Layoffs: యూబీఎస్‌లో 10000 ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉందని సమాచారం. బ్యాంక్‌ మొత్తం సిబ్బందిలో దాదాపు 9 శాతానికి సమానమిది. గత ఏడాది చివరినాటికి ఈ బ్యాంక్‌లో 1.10 లక్షల మంది పనిచేస్తున్నారు. 2023లో క్రెడిట్‌ స్విస్‌ను కొనుగోలు చేసి తనలో విలీనం చేసుకున్న యూబీఎస్‌.. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది.

ఇవీ చదవండి:

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 08 , 2025 | 02:49 AM