Amar Subramanya: భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 09:24 AM
యాపిల్ ఏఐ విభాగం అధిపతిగా భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. ఏఐ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అమర్.. ప్రస్తుత చీఫ్ జాన్ జియానాండ్రియా స్థానంలో ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఏఐ విభాగానికి భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్యను చీఫ్‌గా నియమించింది. జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. యాపిల్ ఫౌండేషన్ ఏఐ మోడల్స్‌తో పాటు మెషీన్ లర్నింగ్ రీసెర్చ్‌కు సంబంధించిన అంశాలను అమర్ పర్యవేక్షిస్తారు (Apple Amar Subramanya).
ఏఐ రంగంలో అమర్ సుబ్రమణ్యకు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన మైక్రోసాఫ్ట్‌లో ఏఐ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకుముందు గూగుల్‌లో 16 ఏళ్ల పాటు సేవలందించారు. జెమినై అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగానికి నేతృత్వం వహించారు. ఇక జియానాండ్రియా వచ్చే ఏడాది తన రిటైర్‌మెంట్ వరకూ యాపిల్‌లో సలహాదారుగా కొనసాగుతారు.
ఏఐ రేసులో యాపిల్ ప్రస్తుతం వెనకబడింది. ఐఫోన్‌లకు ఏఐ ఫీచర్స్ జోడించడంలో జాప్యం జరుగుతోంది. ఐఫోన్స్‌లోని వాయిస్ అసిస్టెంట్ సిరికి ఏఐ మెరుగులు అద్దే పని ఇటీవల వాయిదా పడింది. వచ్చే ఏడాది ఇది పూర్తవుతుందని సంస్థ తెలిపింది. మరోవైపు, యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ ఈ విషయంలో దూసుకుపోతోంది. అనేక ఏఐ ఫీచర్‌లను ఇప్పటికే తన ఫోన్స్‌కు జోడించింది. ఇదిలా ఉంటే, జియానాండ్రియాపై యాపిల్ సీఈఓకు నమ్మకం తగ్గిందన్న వార్తలు కూడా ఇటీవల చక్కర్లు కొట్టాయి.
ఇవీ చదవండి:
రూపాయి రికార్డు పతనం.. సూచీలకు తప్పని నష్టాలు..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి