Share News

Indian Stock Market: ఈ వారంలో రెండు ఐపీఓలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:35 AM

ఈక్విటీ మార్కెట్లో ఈ వారం రెండు ప్రాథమిక పబ్లిక్‌ ఇష్యూలు (ఐపీఓ) విడుదల కానున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన సుబా హోటల్స్‌ ఇష్యూ సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తుంది...

Indian Stock Market: ఈ వారంలో రెండు ఐపీఓలు

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లో ఈ వారం రెండు ప్రాథమిక పబ్లిక్‌ ఇష్యూలు (ఐపీఓ) విడుదల కానున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన సుబా హోటల్స్‌ ఇష్యూ సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తుంది. కోవర్కింగ్‌ విభాగంలోని వియ్‌ వర్క్‌ ఇష్యూ వచ్చే శుక్రవారం ప్రారంభమై అక్టోబరు 7వ తేదీన ముగుస్తుంది. రూ.75.47 కోట్ల సమీకరణ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తున్న సుబా హోటల్స్‌ షేరు ధర శ్రేణిని రూ.105-111గా ప్రకటించింది.

  • వియ్‌ వర్క్‌ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) విధానంలో ఇష్యూ జారీ చేస్తోంది. ఈ కంపెనీ బెంగళూరు, పూణె, హైదరాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడా, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కార్యాలయాలు నిర్వహిస్తోంది.

  • స్పిరిట్‌ తయారీ కంపెనీ ఆల్కోబ్రూ డిస్టిలరీస్‌, ఫిన్‌టెక్‌ కంపెనీ పే నియర్‌బై, ప్రెసిషన్‌ కాంపోనెంట్స్‌ తయారీదారు ఎంఐఎం, కేబుల్‌ తయారీలోని లేజర్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, డిజిటల్‌/ఐటీ కన్సల్టింగ్‌ రంగంలోని సీఎ్‌సఎం టెక్నాలజీ్‌సతో పాటు బిహారీ లాల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలు ఐపీఓల జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించాయి.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 01:35 AM