Share News

TVS Launches NTorq: మార్కెట్లోకి టీవీఎస్‌ ఎన్‌టార్‌క్యూ 150

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:54 AM

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి హైపర్‌ స్పోర్ట్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఎన్‌టార్‌క్యూ 150ను తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ కంపెనీ ఏపీ, తెలంగాణ జనరల్‌ మేనేజర్‌...

TVS Launches NTorq: మార్కెట్లోకి టీవీఎస్‌ ఎన్‌టార్‌క్యూ 150

ధర రూ.1,19,000

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి హైపర్‌ స్పోర్ట్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఎన్‌టార్‌క్యూ 150ను తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ కంపెనీ ఏపీ, తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ (సేల్స్‌) కెంద్‌రాజ్‌ జోషి, బ్రాండ్‌ మేనేజర్‌ రాజ్‌ బిశ్వాస్‌ ఈ స్కూటర్‌ను విడుద చేశారు. 149.7 సీసీ రేస్‌ ట్యూన్డ్‌ ఇంజన్‌, స్టెల్త్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌తో ఈ స్కూటర్‌ను తీసుకువచ్చినట్లు జోషి వెల్లడించారు. ఈ స్కూటర్‌ పరిచయ ధర రూ.1,1,9,000 (ఆల్‌ ఇండియా ఎక్స్‌షోరూమ్‌). యువతను లక్ష్యంగా చేసుకుని ఐఎ్‌సఎస్‌- స్ట్రీట్‌ మోడ్‌, బూస్ట్‌- రేస్‌ మోడ్‌, ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల స్కూటర్‌ మార్కెట్లో టీవీఎస్‌ మోటార్‌ వాటా 38 శాతం వరకు ఉందని, ఈ కొత్త స్కూటర్‌తో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు జోషి తెలిపారు. కాగా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నెల 22 నుంచి జీఎస్‌టీ తగ్గింపును అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 01:55 AM