TVS Apache 20 Years: టీవీఎస్ అపాచీ 20 ఏళ్లు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:49 AM
టీవీఎస్ మోటార్ కంపెనీ పోర్టుఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్...
మార్కెట్లోకి కొత్త మోడళ్ల విడుదల
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): టీవీఎస్ మోటార్ కంపెనీ పోర్టుఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ అపాచీ ఆర్‌టీఆర్ శ్రేణి మోటార్ సైకిళ్లను విడుదల చేశారు. 2005లో అపాచీ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాధాకృష్ణన్ తెలిపారు. దాదాపు 80కి పైగా దేశాల్లో 65 లక్షల మంది వినియోగదారులకు అపాచీ అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా ఉందన్నారు. అపాచీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, 180, 200, ఆర్‌టీఆర్ 310, ఆర్‌ఆర్ 310 లిమిటెడ్ ఎడిషన్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే సరికొత్త ఆర్‌టీఆర్ 160 4వీ, ఆర్‌టీఆర్ 200 4వీ వేరియంట్స్‌ను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ లిమిటెడ్ ఎడిషన్స్ ధరలు రూ.1,37,990 నుంచి రూ.3,37,000 మధ్యన ఉండగా ఆర్‌టీఆర్ 4వీ వేరియంట్స్ ధరలు రూ.1,28,490 నుంచి రూ.1,59,990 మధ్యన ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి