Trumps Tariff War: మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:58 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారాంతంలో చైనా పై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించడంతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ సోమవారం నష్టాల్లో...
సెన్సెక్స్ 174 పాయింట్లు పతనం
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారాంతంలో చైనా పై 100 శాతం అదనపు సుంకాలు ప్రకటించడంతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ సోమవారం నష్టాల్లో పయనించాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ 173.77 పాయింట్లు కోల్పోయి 82,327.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 25,227.35 వద్ద స్థిరపడింది.
టాటా క్యాపిటల్‌కు స్పందన అంతంతే: గత వారం ఐపీఓ ముగించుకున్న టాటా క్యాపిటల్ లిమిటెడ్ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో తన షేర్లను నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.326తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 1.22 శాతం లాభంతో రూ.330 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి 1.35 శాతం లాభంతో రూ.330.40 వద్ద స్థిరపడింది.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News