Share News

రూ.లక్ష కోట్లు వెనక్కి

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:25 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. ఈ నెలలో గడిచిన రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.21,272 కోట్ల పెట్టుబడులను

రూ.లక్ష కోట్లు వెనక్కి

ఈ ఏడాది ఇప్పటికే ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్న మొత్తం ఇది

గడిచిన రెండు వారాల్లో రూ.21,272 కోట్ల ఉపసంహరణ.. ట్రంప్‌ టారి్‌ఫల వడ్డనే కారణం

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. ఈ నెలలో గడిచిన రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.21,272 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో ఏకంగా రూ.78,027 కోట్లు తరలిపోయా యి. అంటే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు దాదాపు రూ.లక్ష కోట్ల (రూ.99,299 కోట్లు) పెట్టుబడులను తరలించేశారు. అమెరికా సుంకాల వడ్డింపులతో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, రూపాయి క్షీణత మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక డాలర్‌ మరింత బలపడింది.


ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ కాస్త తగ్గుముఖం పడితే ఎఫ్‌పీఐలు మళ్లీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే బాండ్‌ మార్కెట్లో మాత్రం ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను కొనసాగించారు. గత రెండు వారాల్లో దాదాపు రూ.1,500 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశారు.



ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 03:25 AM