Term Life Insuranc TROP Plans: ఈ టర్మ్ లైఫ్ పాలసీల ప్రీమియం తిరిగిచ్చేస్తారు
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:01 AM
జీవితం క్షణ భంగురం. మరణం ఎన్నటికైనా తథ్యం. కానీ, నూరేళ్ల ఆయువు అర్ధాంతరంగా ముగియడం దురదృష్టకరం. పాలసీదారు అకాలంగా మరణించిన సందర్భంలో అతడు లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత....
జీవిత బీమా కవరేజీతో పాటు ప్రీమియం రిఫండ్ కోరుకునే వారి కోసం టీఆర్‌ఓపీ
జీవితం క్షణ భంగురం. మరణం ఎన్నటికైనా తథ్యం. కానీ, నూరేళ్ల ఆయువు అర్ధాంతరంగా ముగియడం దురదృష్టకరం. పాలసీదారు అకాలంగా మరణించిన సందర్భంలో అతడు లేదా ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేదే జీవిత బీమా. అందులో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యంత సరళమైన, అందుబాటు ధరలో లభించే పాలసీ. మిగతా లైఫ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం తక్కువ. బీమా కవరేజీ ఎక్కువ. కానీ, పథకం గడువు తీరే నాటికి పాలసీదారు బ్రతికి ఉన్న పక్షంలో చెల్లించిన ప్రీమియం మాత్రం తిరిగి రాదు. పాలసీ గడువు ముగిశాక రిఫండ్ కోరుకునే వారి కోసం బీమా కంపెనీలు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్‌తో కూడిన టర్మ్ ప్లాన్లను (టీఆర్‌ఓపీ) కూడా అందుబాటులోకి తెచ్చాయి. కాకపోతే, వీటి ప్రీమియం కాస్త అధికం. సంప్రదాయ టర్మ్ పాలసీలతో పోలిస్తే రెండింతల వరకు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. జీవిత బీమా కవరేజీతోపాటు ప్రీమియం రిఫండ్ నూ కోరుకునేవారు ఈ పాలసీలను ఎంచుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్‌ఓపీ) ఆప్షన్‌తో కూడిన టర్మ్ లైఫ్ ప్లాన్‌ను ఎంచుకునేవారు గమనించాల్సిన అంశాలు..
రిఫండ్ చేయాల్సిన ప్రీమియం మొత్తం నుంచి బీమా కంపెనీ రుసుముల పేరుతో ఏమైనా మినహాయించుకోనుందా అని పాలసీ కొనుగోలుకు ముందే డాక్యుమెంట్లోని వివరాలను పరిశీలించాలి. లేని పక్షంలో బీమా కంపెనీ ప్రతినిధిని స్పష్టత కోరండి.
బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల గత చరిత్రను కూడా పరిశీలించాలి. కంపెనీ విశ్వసనీయతకు ఇది ప్రతీక.
ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాట్లను తెలుసుకోవాలి. సాధారణంగా కంపెనీ వార్షిక, అర్ధ సంవత్సరం, త్రైమాసిక, నెలవారీ చెల్లిం పు అవకాశాలను కల్పిస్తాయి. మీ ఆదాయానికి అనుగుణమైన ఆప్షన్‌ను ఎంచుకోండి.
ప్రీమియం రిఫండ్‌తోపాటు క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ బెనిఫిట్ వంటి రైడర్ ఆప్షన్లు కూడా ఉన్న ప్లాన్లను ఎంచుకోవడం ఉత్తమం. అయితే, ఈ రైడర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
బెంగాల్‌లో బాబ్రీ మోడల్ మసీదు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన
గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..
Read Latest AP News and National News