టెక్ వ్యూ : 23,100 ఎగువన నిలదొక్కుకుంటేనే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:38 AM
నిఫ్టీ గత వారం పూర్తిగా బేరిష్ ట్రెండ్‌లో సాగుతూ 630 పాయింట్ల నష్టంతో 22,930 వద్ద క్లోజైంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ కీలక స్థాయి అయిన 22,800కి స్వల్ప ఎగువన ఉంది. సానుకూలత కోసం...

టెక్ వ్యూ : 23,100 ఎగువన నిలదొక్కుకుంటేనే..
నిఫ్టీ గత వారం పూర్తిగా బేరిష్ ట్రెండ్‌లో సాగుతూ 630 పాయింట్ల నష్టంతో 22,930 వద్ద క్లోజైంది. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ కీలక స్థాయి అయిన 22,800కి స్వల్ప ఎగువన ఉంది. సానుకూలత కోసం మార్కెట్ ఇక్కడ కచ్చితంగా రికవరీ కావాల్సి ఉంటుంది. పాజిటివ్ ఇండికేషన్ కోసం ఇక్కడ కొద్ది రోజులు నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్ కోసం తదుపరి నిరోధ స్థాయి అయిన 23,100 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలు 23,300. 23,600
బేరిష్ స్థాయిలు: ఏదేనీ బలహీనతను సూచిస్తే తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,800. ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,400.
బ్యాంక్ నిఫ్టీ: ఈ వారంలో ఈ సూచీ సానుకూలత కోసం కీలకమైన 49,000 ఎగువన కన్సాలిడేట్ కావాల్సి ఉంటుంది. రికవరీ సాధిస్తే ప్రధాన నిరోధం 49,600 ఎగువన ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 50,000. బలహీనతను సూచిస్తే మాత్రం 48,700 వద్ద మద్దతు స్థాయిలు ఉంటాయి.
పాటర్న్: మార్కెట్ 22,800 వద్ద డబుల్ బాటమ్ ప్యాట్రన్‌కు స్వల్ప ఎగువన ఉంది. ఇక్కడ బ్రేక్‌డౌన్ అయితే మరింత డౌన్‌సైడ్ బ్రేకౌట్ ప్యాట్రన్‌ను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. 23,100 వద్ద నిరోధం ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,040, 23,100
మద్దతు : 22,870, 22,800
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..