Nifty Technical Analysis: టెక్ వ్యూ 24500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:57 AM
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 25,000 వద్ద విఫలమై వారం అంతా కరెక్షన్ ట్రెండ్‌లోనే ట్రేడయి 445 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 24,300 స్థాయి (ఇక్కడే పలు బాటమ్‌లు ఏర్పడ్డాయి) కన్నా స్వల్పంగా పైన ఉంది. మిడ్‌క్యాప్-100...
టెక్ వ్యూ: 24, 500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 25,000 వద్ద విఫలమై వారం అంతా కరెక్షన్ ట్రెండ్‌లోనే ట్రేడయి 445 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 24,300 స్థాయి (ఇక్కడే పలు బాటమ్‌లు ఏర్పడ్డాయి) కన్నా స్వల్పంగా పైన ఉంది. మిడ్‌క్యాప్-100 (1900 పాయింట్లు), స్మాల్‌క్యాప్-100 (690 పాయింట్లు) సూచీలు కూడా గత వారం భారీగా నష్టపోయాయి. గత కొద్ది వారాల్లో నిఫ్టీ 750 పాయింట్లకు పైగా నష్టపోయిన కారణంగా మార్కెట్లో ప్రస్తుతం టెక్నికల్ రికవరీకి ఆస్కారం ఉంది. అదే సమయంలో మానసిక అవధి 24,500కి చేరువవుతోంది. అంతే కాదు...ఆగస్టు నెలవారీ చార్టులు బలహీనంగా క్లోజ్ కావడం మరింత అప్రమత్తతను సూచిస్తోంది. సానుకూలత కోసం మార్కెట్ ప్రస్తుత స్థాయిల్లో టెక్నికల్‌గా కన్సాలిడేట్ కావడం అవసరం.
బుల్లిష్ స్థాయిలు: గత వారం మార్కెట్ నిట్టనిలువుగా పతనమైనందు వల్ల మొదట నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధం 24,500 కన్నా పైన నిలదొక్కుకుంటే మైనర్ పాజిటివ్ ట్రెండ్ ఏర్పడుతుంది. ప్రధాన నిరోధం 24,700. స్వల్పకాలిక నిరోధం 25,000.
బేరిష్ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా ట్రెండ్‌లో సానుకూలత కోసం కీలక మద్దతు స్థాయి, గతంలో ఏర్పడిన బాటమ్ 24,300 వద్ద రికవర్ అయి తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 24,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం భారీ డౌన్‌ట్రెండ్‌లో ట్రేడయి 1,600 పాయింట్లు నష్టపోయి 53,600 వద్ద ముగిసింది. గత కొద్ది వారల్లో 4,000 పాయింట్ల మేరకు నష్టపోయింది. ట్రెండ్‌లో సానుకూలత కోసం నిరోధస్థాయి 54,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 54,600. గత వారం కనిష్ఠ స్థాయి 53,600 వద్ద విఫలమైతే మరింత బలహీనత తప్పదు. ప్రధాన మద్దతు స్థాయి 53,000.
పాటర్న్: నిఫ్టీ ప్రస్తుతం స్వల్పకాలిక 100 డిఎంఏకు చేరువవుతోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. 24,300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద ప్రధాన మద్దతు ఇంది. ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే మరింత బలహీనత ఏర్పడుతుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,500, 24,560
మద్దతు : 24,380, 24,300
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి