Share News

Tech View: కీలక మద్దతు స్థాయి 25000

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:58 AM

నిఫ్టీ గత వారం అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమై గరిష్ఠ స్థాయి 25,450 వరకు వెళ్లినా శుక్రవారం రియాక్షన్‌ సాధించింది. చివరికి 24,327 వద్ద ముగిసింది. మూడు వారాల ర్యాలీలో...

Tech View: కీలక మద్దతు స్థాయి 25000

నిఫ్టీ గత వారం అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమై గరిష్ఠ స్థాయి 25,450 వరకు వెళ్లినా శుక్రవారం రియాక్షన్‌ సాధించింది. చివరికి 24,327 వద్ద ముగిసింది. మూడు వారాల ర్యాలీలో 1,000 పాయింట్ల మేరకు లాభపడిన అనంతరం అప్రమత్త ట్రెండ్‌ కనబరిచింది. అయితే మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు మాత్రం మంచి లాభాలతో ముగిశాయి. గత వారం నిఫ్టీ 25,000 వద్ద బ్రేకౌట్‌ సాధించినందు వల్ల టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌లో పడింది. శుక్రవారం నాడు నిఫ్టీ గత మూడు వారాల్లో గరిష్ఠ రియాక్షన్‌ సాధించినందు వల్ల ప్రస్తుతం మరింత రియాక్షన్‌ ఏర్పడవచ్చు. ట్రెండ్‌లో సానుకూలత కోసం ప్రధాన మద్దతు స్థాయి 25,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి.

బుల్లిష్‌ స్థాయిలు: ఈ వారంలో కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ ట్రెండ్‌ ఏర్పడవచ్చు. అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించాలంటే ప్రధాన నిరో ధం 25,500 కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. మరో ప్రధాన నిరోధం 26,000.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీకి 25,200 వద్ద మైనర్‌ మద్దతు, 25,000 వద్ద ప్రధాన మద్దతు స్థాయిలున్నాయి. 25,000 వద్ద నిలదొక్కుకుంటే సానుకూల సంకేతం ఇస్తుంది. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 650 పాయింట్ల మేరకు లాభపడి 55,800 వద్ద క్లోజయినా శుక్రవారం నాటి 270 పాయింట్ల బలమైన రియాక్షన్‌ కారణంగా మార్కెట్‌ అప్రమత్త ట్రెండ్‌లో పడింది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించాలంటే నిరోధ స్థాయి 56,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనపడినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 55,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే మరింత బలహీనత తప్పదు.

పాటర్న్‌: ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి కనిపిస్తోంది. స్వల్పకాల బలహీనతకు ఆస్కారం ఉంది. సానుకూలత కోసం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 25,410, 25,500

మద్దతు : 25,200, 25,120

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 04:58 AM