Nifty Tech View: 26300 వద్ద మరోసారి గట్టి పరీక్ష
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:41 AM
గత వారం నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 26,300 నుంచి దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత 26,000 వద్ద రికవరీ సాధించి సానుకూల ట్రెండ్‌ను సూచించింది. చివరకు 150 పాయింట్లు రికవరీ సాధించి...
గత వారం నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 26,300 నుంచి దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత 26,000 వద్ద రికవరీ సాధించి సానుకూల ట్రెండ్‌ను సూచించింది. చివరకు 150 పాయింట్లు రికవరీ సాధించి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 26,185 పాయింట్ల వద్ద క్లోజైంది. మార్కెట్ గత మూడు వారాలుగా 26,000 స్థాయిల వద్ద సైడ్‌వేస్, ఆటుపోట్ల ట్రెండ్‌లో సాగుతూ వస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 26,300 దిగువనే ఉంది. టెక్నికల్‌గా నిఫ్టీ ఈ స్థాయిల వద్ద స్వల్పకాల నిరోధాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ మార్కెట్లో ఇంకా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీ ఈ నిరోధ స్థాయిలను బ్రేకౌట్ చేస్తే తదుపరి అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. మిడ్‌క్యాప్-100 ఇండెక్స్ కూడా వారం ప్రాతిపదికన 450 పాయింట్ల కరెక్షన్‌ను కనబరిచింది. గత నాలుగు వారాలుగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలైన 61,000 వద్ద కన్సాలిడేట్ అవుతూ వస్తోంది. స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ కూడా గత వారం 320 పాయింట్ల మేర కరెక్షన్‌ను కనబరిచింది.
బుల్లిష్ స్థాయిలు: సానుకూల ట్రెండ్ కోసం ప్రధాన నిరోధ స్థాయిలైన 26,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. వచ్చే కొద్ది రోజులు ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. అప్పుడు మార్కెట్ కొత్త శిఖరాల వైపు అడుగులు వేస్తుంది. తదుపరి మానసిక అవధి 26,600.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 26,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. ఇది గత వారం బాటమ్‌లో ఏర్పడిన స్థాయి. సానుకూల ట్రెండ్, రక్షణ కోసం ఈ స్థాయిలకు ఎగువన కచ్చితంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 60,000 రియాక్షన్‌ను కనబరిచి చివరకు బలంగా రికవరీ సాధించింది. వారాంతంలో నిలకడగా 59,970 వద్ద ముగిసి నిలకడను ప్రదర్శించింది. ఈ వారంలో సూచీ ప్రస్తుత నిరోధ స్థాయిలైన, గరిష్ఠ స్థాయిలైన 60,100 వద్ద కొద్ది రోజుల పాటు నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఏదేనీ బలహీనతను సూచిస్తే మాత్రం తదుపరి మద్దతు స్థాయిలు 59,500 దిగువన ఉంటాయి. ఇక్కడ మరింత బలహీనతకు ఆస్కారం ఉంది. తదుపరి మద్దతు స్థాయి 58,900.
పాటర్న్: మరింత అప్‌ట్రెండ్ కోసం మార్కెట్ 26,300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్ వద్ద నిలదొక్కుకోవాలి. 26,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. నిఫ్టీ గతవారం 26,000 స్థాయిల వద్ద 25 రోజుల స్వల్పకాలిక చలన సగటు వద్ద రికవరీ సాధించింది.
టైమ్: ఈ సూచీ ప్రకారం సోమవారం, శుక్రవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 26,240, 26,300
మద్దతు : 26,150, 26,000
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి