Share News

Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ 17200 కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:30 AM

టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ మెగా పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. గ్రూప్‌ కంపెనీ టాటా క్యాపిటల్‌ ఈ నెలాఖరులోగా పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయనుంది. ఈ ఇష్యూ సైజు 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.17,200 కోట్లు) వరకు ఉంటుందని...

Tata Capital IPO: టాటా క్యాపిటల్‌ 17200 కోట్ల ఐపీఓ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ మెగా పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. గ్రూప్‌ కంపెనీ టాటా క్యాపిటల్‌ ఈ నెలాఖరులోగా పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయనుంది. ఈ ఇష్యూ సైజు 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.17,200 కోట్లు) వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. దీంతో కంపెనీ వాల్యుయేషన్‌ 1,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.96,800 కోట్లు) వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.. ఈ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమవుతుందని సమాచారం. ఈ ఐపీఓ మదుపరుల ఆదరణకు నోచుకుంటే భారత క్యాపిటల్‌ మార్కెట్లో అతి పెద్ద ఫైనాన్షియల్‌ ఐపీఓ కానుంది.

  • టాటా మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త వింగర్‌ ప్లస్‌ తీసుకువచ్చింది. ప్రీమియం ప్యాసింజర్‌ మొబిలిటీలో ఇది కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని కంపెనీ వెల్లడిచింది. ఈ వాహనం ధర రూ.20.60 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).

  • ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఇన్‌స్టామార్ట్‌ డెలివరీలు 339 శాతం పెరిగినట్లు ప్రకటించింది. కేవలం 12 నిమిషాల్లో ఉత్పత్తులను డెలివరీ చేయటం ఇందుకు ఎంతగానో కలిసివచ్చిందని వెల్లడించింది. సౌందర్య ఉత్పత్తులు 323 శాతం, పెంపుడు జంతువుల ఆహార పదార్ధాల డెలివరీలు ఏకంగా 522 శాతం పెరిగాయని తెలిపింది.

  • మైనింగ్‌, ఇన్‌ఫ్రా రంగాలకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎపిరాక్‌.. మహారాష్ట్రలోని నాసిక్‌లో కొత్త ప్లాంట్‌తో పాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. గనులు, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనుంది. కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని రాక్‌ డ్రిల్లింగ్‌ టూల్స్‌ యూనిట్‌ సామర్థ్యాన్ని విస్తరించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 01:30 AM