Share News

Tata Capital IPO: అక్టోబరు 6న టాటా క్యాపిటల్‌ ఐపీఓ

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:47 AM

టా టా సన్స్‌ అనుబంధ ఎన్‌బీఎ్‌ఫసీ టాటా క్యాపిటల్‌ అక్టోబరు 6వ తేదీన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) జారీ చేయనున్న ట్టు ప్రకటించింది. రూ.15,512 కోట్ల సమీకరణ లక్ష్యం గా...

Tata Capital IPO: అక్టోబరు 6న టాటా క్యాపిటల్‌ ఐపీఓ

ఇష్యూ ధర రూ.310-326

ముంబై: టా టా సన్స్‌ అనుబంధ ఎన్‌బీఎ్‌ఫసీ టాటా క్యాపిటల్‌ అక్టోబరు 6వ తేదీన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) జారీ చేయనున్న ట్టు ప్రకటించింది. రూ.15,512 కోట్ల సమీకరణ లక్ష్యం గా రంగంలోకి దిగుతున్న ఈ సంస్థ షేరు ధర శ్రేణిని రూ.310-326గా ప్రకటించింది. గరిష్ఠ ధరలో కంపెనీ విలువ రూ.1.38 లక్షల కోట్లవుతుంది. అక్టోబరు 8వ తేదీన ఇష్యూ ముగుస్తుంది. మొత్తం 47.58 కోట్ల షేర్లను విడుదల చేస్తుండగా అందులో 21 కోట్ల తాజా షేర్లున్నాయి. 26.58 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) విధానంలో విక్రయిస్తారు.

ఆర్థిక రంగంలో అతి పెద్ద ఇష్యూ: ఈ ఏడాది లో ఇదే అతి పెద్ద ఇష్యూ అవుతుంది. దేశీయ ఆర్థిక రంగంలో అయితే ఇప్పటివరకు ఇదే అతి పెద్ద ఇష్యూ. ఇటీవల సంవత్సరాల్లో టాటా గ్రూప్‌ నుంచి విడుదలవుతున్న రెండో ఇష్యూ ఇది. ఎన్‌బీఎ్‌ఫసీగా గుర్తించిన 3 సంవత్సరాల్లోగా ఐపీఓ జారీ చేయాలన్న నిబంధనకు అనుగుణంగా ఈ ఇష్యూ జారీ చేస్తున్నారు.


రెండేళ్ల కనిష్ఠానికి టాటా మార్కెట్‌ క్యాప్‌

స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లు టాటా గ్రూప్‌లోని 16 కంపెనీల షేర్ల ధరలను గుంజేస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఈ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కె ట్‌ క్యాప్‌) 7,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.65 లక్షల కోట్లు) మేర క్షీణించింది. గత అక్టోబరులో దాదాపు 40,000 కోట్ల డాలర్ల వరకు ఉన్న ఈ కంపె నీల మార్కెట్‌విలువ ప్రస్తుతం 32,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.28.84 లక్షల కోట్లు) పడిపోయింది. టాటా గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ గత రెండేళ్లలో ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. హెచ్‌-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఈ నెల 19న ప్రకటించారు. అప్పటి నుంచి చూసినా ఈ కంపెనీల షేర్ల మార్కెట్‌ క్యాప్‌ 2,000 కోట్ల డాలర్లు పతనమయింది.

ఇవి కూడా చదవండి

ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 05:47 AM