Share News

Taneira Expects Double Digit: ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధి తనైరా

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:11 AM

టాటా గ్రూప్‌నకు చెందిన ఎథ్నిక్‌ వేర్‌ బ్రాం డ్‌ తనైరా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం

Taneira Expects Double Digit: ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధి తనైరా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా గ్రూప్‌నకు చెందిన ఎథ్నిక్‌ వేర్‌ బ్రాం డ్‌ తనైరా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో సంస్థ ఆదాయం రూ.276 కోట్లుగా ఉందని పండగ సీజన్‌ అమ్మకాలతో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు తనైరా చీఫ్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సోమ్‌ప్రభ్‌ సింగ్‌ తెలిపారు. రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కలెక్షన్‌తో పాటు వివాహాల వంటి వాటి కోసం ఈఎంఐ ఆధారిత కొనుగోలు ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. కాగా తనైరా.. హైదరాబాద్‌లో 6 స్టోర్లు, ఏపీలోని విజయవాడలో ఒక స్టోర్‌ను నిర్వహిస్తోందన్నారు. కొత్తగా మరో 2-3 స్టోర్లను ప్రారంభించాలని చూస్తున్నట్లు సింగ్‌ తెలిపారు. తనైరా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో 80 స్టోర్లను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 03:11 AM