JSW Steel Bid Rejected: భూషణ్ స్టీల్ టేకోవర్‌కు సుప్రీం బ్రేక్
ABN , Publish Date - May 03 , 2025 | 05:03 AM
భూషణ్ పవర్ అండ్ స్టీల్ టేకోవర్‌పై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రణాళికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీపీఎస్ఎల్‌ను లిక్విడేషన్‌కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్)ను టేకోవర్ చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సమర్పించిన రూ.19,700 కోట్ల ప్రణాళికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బిడ్ చెల్లదని, దివాలా స్మృతి చట్ట నియమావళికి వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు, బీపీఎస్ఎల్ లిక్విడేషన్ (కంపెనీ ఆస్తులను వేలం వేసి విక్రయించడం)కు కోర్టు ఆదేశించింది.