Indo-America Trade: భారత్-అమెరికా మిషన్ 500

ABN , First Publish Date - 2025-04-10T16:48:43+05:30 IST

ఆటో టారిఫ్స్ తగ్గిస్తామని.. బదులుగా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గించాలని భారత్.. అమెరికాకు ఒక ప్రతిపాదన పెట్టబోతోంది. తద్వారా ఇరుదేశాల మధ్య "మిషన్ 500" కార్యాచరణకు వీలుంటుందని భావిస్తోంది.

Indo-America Trade: భారత్-అమెరికా మిషన్ 500
trump and modi

Indo-America Tariff talks: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా మినహా ప్రపంచదేశాలపై తన టారిఫ్స్ మోతను 90 రోజుల పాటు వాయిదా వేసి ఒక కొత్త అధ్యాయానికి తెరతీశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి తీసుకుని ముందుకు సాగుతున్నాయి. ఇదిలాఉంటే, అమెరికా-భారత్ మధ్య భవిష్యత్ వాణిజ్య సంబంధాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ముందుకు సాగేందుకు ఇరుదేశాలు ఒక అంగీకారానికి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో ఆటో టారిఫ్ కోతలకు బదులుగా వ్యవసాయ ఉత్పత్తులపై రాయితీలను భారతదేశం కోరుతోంది. ఈ మేరకు అమెరికా నుంచి ఆమోదం లభిస్తే మంచిదని భారత్ అనుకుంటోంది.

భారత్ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో తమ వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్స్ తగ్గించాలని భారత్ కోరుకుంటోంది. బదులుగా ఆటో దిగుమతులపై విధించే టారిఫ్ తాము తగ్గిస్తామని ఇండియా చెబుతోంది. ఇది కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులకు తగిన రక్షణను కల్పిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి లెక్కల్ని ఖరారు చేయడానికి భారత ఆర్థిక, వ్యవసాయ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య ప్రతిరోజూ సమావేశాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు-సెప్టెంబర్ నాటికి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని భారత్ కసరత్తు చేస్తోంది. ఐదు నుండి ఏడేళ్లలో దశలవారీగా సుంకం తగ్గింపులను భారత్ ప్రతిపాదిస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ - అమెరికా ప్రస్తుతం పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) యొక్క రూపురేఖలపై చర్చిస్తున్న సంగతి తెలిసిందే ఇది "మిషన్ 500" అనే కొత్త లక్ష్యంలో భాగం. ఫిబ్రవరి 13న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా దీనికి ఇరు దేశాలు అంగీకరించాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ అంటే, $500 బిలియన్లకు చేర్చడమే దీని లక్ష్యం. కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారతదేశపు వ్యవసాయ వస్తువుల ఎగుమతులు $6.04 బిలియన్లుగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Read More Business News and Latest Telugu News

Updated Date - 2025-04-10T16:59:43+05:30 IST