Stock Market Rally Breaks: మార్కెట్ ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:06 AM
ఈక్విటీ మార్కెట్లో గత వారం ఏర్పడిన ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, ఆటో షేర్లలో లాభాల స్వీకారం సోమవారం మార్కెట్‌ను నష్టాల్లోకి నడిపింది. ఐదు రోజుల ర్యాలీకి తెర దించిన సెన్సెక్స్...
ముంబై: ఈక్విటీ మార్కెట్లో గత వారం ఏర్పడిన ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, ఆటో షేర్లలో లాభాల స్వీకారం సోమవారం మార్కెట్‌ను నష్టాల్లోకి నడిపింది. ఐదు రోజుల ర్యాలీకి తెర దించిన సెన్సెక్స్ 118.96 పాయింట్ల నష్టంతో 81,785.74 వద్ద ముగియగా ఎనిమిది రోజుల ర్యాలీకి తెర దించిన నిఫ్టీ 44.80 పాయింట్ల నష్టంతో 25,069.20 వద్ద ముగిసింది. ఈ వారంలో జరగనున్న అమెరికన్ ఫెడరల్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాబాల స్వీకారానికి దిగారని విశ్లేషకులంటున్నారు.
కెనరా రొబెకో, కెనరా హెచ్‌ఎ్‌సబీసీ ఐపీఓలకు ఓకే: తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) జారీకి కెనరా రొబెకో ఏఎంసీ, కెనరా హెచ్‌ఎ్‌సబీసీ, హీరో మోటార్స్ సహా ఆరు కంపెనీలకు సెబీ ఆమోదం తెలిపింది. అనుమతి పొందిన మిగతా కంపెనీల్లో ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్స్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ రూ.9,000 కోట్లు సమీకరించనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News