Share News

Stock Market Volatility: ఆచితూచి అడుగేయండి

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:00 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అయితే జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ అంచనాలను మించటం, ట్రంప్‌ టారిఫ్స్‌ను అమెరికా ఫెడరల్‌ కోర్టు అడ్డుకోవటం వంటి వార్తలు సానుకూల సెంటిమెంట్‌ను...

Stock Market Volatility: ఆచితూచి అడుగేయండి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అయితే జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ అంచనాలను మించటం, ట్రంప్‌ టారిఫ్స్‌ను అమెరికా ఫెడరల్‌ కోర్టు అడ్డుకోవటం వంటి వార్తలు సానుకూల సెంటిమెంట్‌ను నింపే వీలుంది. అదే జరిగితే మార్కెట్లో పుల్‌బ్యాక్‌ ర్యాలీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌, యాన్సిలరీస్‌, ఎఫ్‌ఎంసీజీ, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌, రిటైల్‌, ఎలక్ట్రికల్స్‌ వంటి రంగాలు మాత్రమే కొంత బలం ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఎల్‌ అండ్‌ టీ: కొన్ని నెలలుగా ఈ షేరు సైడ్‌వే్‌సలో చలిస్తోంది. ఇప్పుడిప్పుడే మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతున్నాయి. వాల్యూమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.3,061 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,570 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.3,850 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.3,500 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

కోల్గేట్‌ పామోలివ్‌: గత ఏడాది సెప్టెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతోంది. స్వల్పకాలిక మూమెంటమ్‌ను బట్టి రివర్సల్‌కు అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.2,331 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,300 స్థాయిలో ప్రవేశించి రూ.2,700 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.2,260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

వోల్టాస్‌: గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మంచి బేస్‌ ఏర్పడింది. ప్రస్తుతం కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.1,374 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,350 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,325 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


సీజీ పవర్‌: ప్రస్తుతం ఈ షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. చక్కటి బేస్‌ ఏర్పడింది. పైగా అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ సైతం మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.694 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.680 శ్రేణిలో ప్రవేశించి రూ.740 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.660 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐటీసీ: రెండేళ్లుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాలకు మక్కువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ షేరు ఆకర్షణీయంగా మారింది. గత శుక్రవారం రూ.409 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.400 శ్రేణిలో ఎంటరై రూ.445 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.385 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:00 AM