Stock Market: నష్టాలతో మొదలైన సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:12 AM
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ రంగంలో అమ్మకాలు సూచీలు వెనక్కి లాగుతున్నాయి.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ రంగంలో అమ్మకాలు సూచీలు వెనక్కి లాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్‌కు నెగిటివ్‌గా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి (Indian stock market).
సోమవారం ముగింపు (82, 159)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 82, 024 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 44 పాయింట్ల నష్టంతో 25, 157 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, వోడాఫోన్ ఐడియా, ఎమ్ అండ్ ఎమ్, టీవీఎస్ మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఎంఫసిస్, ట్రెంట్, అదానీ ఎనర్జీ, ఆసియన్ పెయింట్స్, నవుమా వెల్త్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 207 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.56గా ఉంది.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..