Share News

Stock Market: లాభాలతో వారం ప్రారంభం.. 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

ABN , Publish Date - May 26 , 2025 | 04:20 PM

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చల పొడిగింపును జులై 9 వరకు వాయిదా వేయడంతో 50 శాతం టారిఫ్‌ల అమలు వాయిదా పడడం అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో దేశీయ సూచీలు కూడా ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించింది.

Stock Market: లాభాలతో వారం ప్రారంభం.. 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
Stock Market

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చల పొడిగింపును జులై 9 వరకు వాయిదా వేయడంతో 50 శాతం టారిఫ్‌ల అమలు వాయిదా పడడం అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో దేశీయ సూచీలు కూడా ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించింది. ఐటీ, ఆటో, మెటల్ స్టాక్స్ రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సోమవారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లతో పాటు సెన్సెక్స్, నిఫ్టీ కూడా లాభాలతో ముగిశాయి. (Business News).


గత శుక్రవారం ముగింపు (81, 721)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడి 82, 492 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ కిందకు దిగి వచ్చింది. చివరకు 455 పాయింట్ల లాభంతో 82, 176 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 148 పాయింట్ల లాభంతో 25, 001 వద్ద రోజును ముగించింది. 25 వేల మార్క్‌కు పైన ముగిసింది.


సెన్సెక్స్‌లో హడ్కో, దివీస్ ల్యాబ్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఆస్ట్రాల్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎటర్నల్, దాల్మియా భారత్, ఏంజెల్ వన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 379 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.08గా ఉంది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 04:54 PM