Share News

Stock Market: లాభాల బాటలో దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jun 18 , 2025 | 10:02 AM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే బాటలో దేశీయ సూచీలు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి.

Stock Market: లాభాల బాటలో దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే బాటలో దేశీయ సూచీలు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మొదట నష్టాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. (Business News).


మంగళవారం ముగింపు (81, 583)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో ఏకంగా 300 పాయింట్లకు పైగా లాభపడి 81, 858 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం మళ్లీ కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 81, 725 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 54 పాయింట్ల లాభంతో 24, 907 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యూనో మిండా, అవెన్యూ సూపర్‌మార్కెట్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ జింక్, మ్యాక్స్ హెల్త్‌కేర్, పీబీ ఫిన్‌టెక్, టొరెంట్ ఫార్మా షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 118 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.31గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


For National News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 10:02 AM