Share News

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 230 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్

ABN , Publish Date - May 28 , 2025 | 03:54 PM

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. మంగళవారం భారీగా నష్టపోయిన సూచీలు బుధవారం కూడా అదే బాటలో కొనసాగాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం మాత్రం కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

Stock Market: కొనసాగుతున్న నష్టాలు.. 230 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్
Stock Market

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. మంగళవారం భారీగా నష్టపోయిన సూచీలు బుధవారం కూడా అదే బాటలో కొనసాగాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం మాత్రం కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు కూడా నష్టాల బాటలోనే సాగాయి (Business News).


మంగళవారం ముగింపు (81, 551)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. బుధవారం సెన్సెక్స్ 81, 244-81,613 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 81, 312 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 73 పాయింట్ల నష్టంతో 24, 752 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఎల్‌ఐసీ ఇండియా, సీడీఎస్‌ఎల్, ఐజీఎల్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎస్కార్ట్స్ కుబాటా, అరబిందో ఫార్మా, శ్రీ సిమెంట్స్, ఐటీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 13 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.36గా ఉంది.


ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 04:16 PM