Share News

Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 10:32 AM

దేశీయ సూచీలు ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి.

Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

బ్రిక్స్ అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలన్నింటి పైనా పది శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో రూపాయి విలువ కాస్త క్షీణించింది. ఆ ప్రభావంతో దేశీయ సూచీలు ఈ వారాన్ని స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. (Business News).


గత శుక్రవారం ముగింపు (83, 432)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా కోల్పోయి 83, 262 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 83, 348 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 25 పాయింట్ల నష్టంతో 25, 435 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో గోద్రేజ్ కన్స్యూమర్, డాబర్ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్, పెట్రొనాట్ ఎల్‌ఎన్‌జీ, ట్రంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ టవర్స్, జుబిలెంట్ ఫుడ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, ఎటర్నల్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3 పాయింట్ల స్వల్ప లాభంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.70గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2025 | 10:32 AM