Share News

Stock Market: స్టాక్ మార్కెట్‌కు లాభాల కళ.. 300 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:02 PM

రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు స్టాక్‌మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఈ వారంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ కలవబోతుండడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం మదుపర్లలో జోష్‌ను నింపింది.

Stock Market: స్టాక్ మార్కెట్‌కు లాభాల కళ.. 300 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
Stock Market

వరుసగా శుభవార్తల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోవడం, అంతర్జాతీయంగా సానుకూలాంశాలు స్టాక్‌మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఈ వారంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ కలవబోతుండడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం మదుపర్లలో జోష్‌ను నింపింది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో ఉన్నాయి (Business News).


మంగళవారం ముగింపు (80, 235)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 250 పాయింట్ల పైచిలుకు లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. పలు రంగాలు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 450 పాయింట్లు లాభపడి 80,683 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 304 పాయింట్ల లాభంతో80, 539 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 131 పాయింట్ల లాభంతో 24, 619 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో అపోలో హాస్పిటల్స్, భారత్ డైనమిక్స్, బీఎస్‌ఈ లిమిటెడ్, నైకా, హిందోల్కా షేర్లు లాభాలను ఆర్జించాయి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎస్‌జేవీఎన్, సుజ్‌లాన్ ఎనర్జీ, ఆయిల్ ఇండియా, ఎల్‌ఐసీ ఇండియా షేర్లు నష్టాల బాటలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 356 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.71గా ఉంది.


ఇవి కూడా చదవండి

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 04:02 PM