Stock Market: తొలగిన యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు..
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:05 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈ సానుకూల సంకేతాల నడుమ ఉదయం నుంచి దేశీయ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడాయి. భారీ లాభాలతో రోజును ముగించాయి
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చల్లారడంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగివచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈ సానుకూల సంకేతాల నడుమ ఉదయం నుంచి దేశీయ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడాయి. భారీ లాభాలతో రోజును ముగించాయి (Business News).
మంగళవారం ముగింపు (82, 055)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. సెన్సెక్స్ 82, 815 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82, 755 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 200 పాయింట్ల లాభంతో 25, 244 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25, 200 వేల మార్క్‌ను అందుకుంది.
సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, బిర్లాసాఫ్ట్, పేజ్ ఇండస్ట్రీస్, హెచ్‌ఎఫ్‌సీఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎంజెల్ వన్, భారత్ ఎలక్ట్రానిక్స్, మాజగాన్ డాక్, డిక్సన టెక్నాలజీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 259 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.08గా ఉంది.
ఇవీ చదవండి:
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి