Stock Market Crash India: లాభాల స్వీకారంతో బేర్
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:23 AM
లాభాల స్వీకారం, ఎఫ్‌పీఐల అమ్మకాలు సోమవారం స్టాక్ మార్కెట్‌ను కుంగదీశాయి. సెన్సెక్స్ 609.68 పాయింట్ల నష్టంతో 85,102.69 వద్ద ముగియగా నిఫ్టీ 225.90 పాయింట్ల నష్టంతో...
రూ.7.12 లక్షల కోట్లు హాంఫట్
ముంబై: లాభాల స్వీకారం, ఎఫ్‌పీఐల అమ్మకాలు సోమవారం స్టాక్ మార్కెట్‌ను కుంగదీశాయి. సెన్సెక్స్ 609.68 పాయింట్ల నష్టంతో 85,102.69 వద్ద ముగియగా నిఫ్టీ 225.90 పాయింట్ల నష్టంతో 25,960.55 వద్ద ముగిసింది. దీంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ రూ.7.12 లక్షల కోట్లు నష్టపోయి రూ.464.19 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 29 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఈ పతనానికి కారణాలేమిటో పరిశీలిద్దాం.
వడ్డీరేట్లపై సందిగ్ధత: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెన డా, స్విట్జర్లాండ్ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య, పరపతి విధానాలు ఈ వారం వెలువడనున్నాయి. అన్నిటికంటే బుధవారం వెలువడే ‘ఫెడ్ రిజర్వ్’ పరపతి విధానం కోసం భారత మార్కెట్ ఆసక్తితో ఎదురు చూస్తోంది. ట్రంప్ ఒత్తిళ్లకు తలొ గ్గి ఫెడ్ చైర్మన్ జెరోం పోవెల్ కీలక వడ్డీరేట్లను పావు శాతమైనా తగ్గిస్తారా, లేదా అన్నదే ప్రధానాంశం. సోమవారం భారత మార్కెట్ నష్టాలకు ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.
ఎఫ్‌పీఐల అమ్మకాలు: గత ఏడాది వరకు మన స్టాక్ మార్కెట్‌లో ఎగబడి కొన్న ఎఫ్‌పీఐలు, ఈ ఏడాది ప్రారంభం నుంచే చిన్న చూపు చూస్తున్నాయి. ఇక్క డ అమ్మి చైనా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి. ఈ నెల ఇప్పటి వరకు ఈ సంస్థలు రూ.1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారంనాడు కూడా ఈ సంస్థలు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగ డం సూచీలను దెబ్బతీసింది.
రూపాయి పతనం: డాలర్‌తో రూపా యి మారకం రేటు పతనం ఎఫ్‌పీఐలను మరింత బెంబేలెత్తిస్తోంది. ఈ సంవత్స రం ఇప్పటికే డాలర్‌తో ఐదు శాతం వర కు నష్టపోయిన రూపాయి, సోమవారం మరో 10 పైసలు నష్టపోయి రూ.90.05 వద్ద ముగిసింది. పెరుగుతున్న వాణిజ్య లోటు డాలర్‌తో రూపాయి మారకం రేటు త్వరలోనే రూ.92-93కు చేరే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌ను మరిం త భయపెడుతున్నాయు.
చమురు మంట: అంతర్జాయ ఉద్రిక్తతలతో చమురు ధర మళ్లీ మండుతోది. సోమవారం బ్రెంట్ రకం చమురు బ్యారెల్ ధర గత రెండు వారాల్లో ఎన్న డూ లేని విధంగా 63.83 డాలర్లకు చేరిం ది. దీంతో మన వాణిజ్య లోటు పెరిగి చెల్లింపులు సమతౌల్యం దెబ్బతినే ప్రమా దం ఉందని భయపడుతున్నారు.
ఔట్‌లుక్: నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 26,000 పాయింట్ల దిగువన క్లో జైంది. తదుపరి మద్దతు 25,900-25,850 మధ్య ఉంటుందని టెక్నికల్ విశ్లేషకుల అంచనా. ఈ మద్దతు స్థాయిలు కూడా బ్రేకైతే నిఫ్టీ 50 సూచీ 25,500 స్థాయికి కూడా పతనమయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి