Share News

GST : జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2025 | 05:38 AM

ఈ ఏడాది జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12.3 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలానికి రిఫండ్లు 24 శాతం పెరిగి రూ.23,853 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను మినహాయించగా, నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1.72

GST : జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

జనవరిలో 12% వృద్ధి

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12.3 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలానికి రిఫండ్లు 24 శాతం పెరిగి రూ.23,853 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను మినహాయించగా, నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది జనవరితో పోలిస్తే 10.9 శాతం అధికమిది. జీఎ్‌సటీ ఆదాయం క్రమంగా పెరుగుతుండటం ఆర్థిక వృద్ధి, వ్యాపారుల సక్రమ పన్ను చెల్లింపులకు సంకేతమని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగ అధిపతి, భాగస్వామి అభిషేక్‌ జైన్‌ అన్నారు. కాగా, జనవరి నెలకు తెలంగాణలో జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.6,017 కోట్లకు పెరగగా.. ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు ఏ వృద్ధి లేకుండా రూ.3,604 కోట్లుగా నమోదయ్యాయి.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:52 AM