Share News

Stock Market Success: లక్కంటే ఇదే..రూ.16 వేల పెట్టుబడితో రెండేళ్లలో రూ.56 లక్షల ప్రాఫిట్..

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:41 PM

స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ ఎప్పుడు పుంజుకుంటుందో (Stock Market Success) వెంటనే అంచనా వేయలేం. కానీ పలు కంపెనీల పెన్నీ స్టాక్స్ (Penny Stock) మాత్రం తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తాయి. ఇప్పుడు కూడా మరో పెన్నీ స్టాక్ పెట్టుబడి దారులకు రెండేళ్లలోనే 32000 వేల శాతానికిపైగా లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Stock Market Success: లక్కంటే ఇదే..రూ.16 వేల పెట్టుబడితో రెండేళ్లలో రూ.56 లక్షల ప్రాఫిట్..
Stock Market Success

స్టాక్ మార్కెట్లో చిన్న కంపెనీల పెన్నీ స్టాక్స్ (Penny Stock) చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇవే స్టాక్స్ ధరలు అనూహ్యంగా భారీగా పెరిగిపోతాయి. ఇవి ప్రారంభంలో వెలకట్టలేనివిగా అనిపించినా, సరైన టైం వచ్చినప్పుడు మాత్రం అమాంతం పైకి వెళ్తాయి. ఇప్పుడు కూడా అలాగే శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ (Sri Adhikari Brothers Television Network) కంపెనీ స్టాక్ రెండేళ్లలోనే దాదాపు 32,000 శాతానికిపైగా పెరిగింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు చేసిన పలువురు ఇన్వెస్టర్లు కోటీశ్వరులుగా మారిపోయారు. మరికొంత మంది లక్షాధికారులు (Stock Market Success) అయ్యారు.


అసాధారణ పెరుగుదల

శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ స్టాక్ రెండేళ్లలో చూపిన పెరుగుదల నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 9, 2023న దీని ఒక్కో షేరు ధర రూ.1.64గా ఉండగా, జూన్ 9, 2025 నాటికి రూ.566.55కి చేరుకుంది. ఈ వృద్ధి రేటు లెక్కించినట్లయితే, స్టాక్ ధరలో సుమారు 32,998% పెరుగుదల కనిపిస్తుంది. అంటే, రూ.1.64 పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడు రెండేళ్లలో ఒక్కో షేరుకు రూ.566.55 లాభం పొందాడు. ఇటువంటి లాభాలు స్టాక్ మార్కెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది శ్రీ అధికారి బ్రదర్స్ స్టాక్‌ విషయంలో నిజం అయ్యింది.


రూ.56 లక్షల లాభం ఎలా

ఈ స్టాక్‌లో పెట్టుబడి చేసిన వారికి లాభాలు ఎలా వచ్చాయో ఇక్కడ చుద్దాం. ఒక పెట్టుబడిదారుడు జూన్ 9, 2023న శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో 10,000 స్టాక్స్‌ను కొనుగోలు చేశాడనుకుందాం. అప్పటి ధర రూ.1.64 కాబట్టి, అతని మొత్తం పెట్టుబడి ఖర్చు 10,000 × 1.64 = రూ.16,400 అవుతుంది. దానిని రెండేళ్ల పాటు ఉంచితే ఇప్పుడు, జూన్ 9, 2025 నాటికి ఒక్కో షేరు ధర రూ.566.55కి చేరుకుంది. కాబట్టి, అతని 10,000 షేర్ల విలువ 10,000 × 566.55 = రూ.56,65,500 అవుతుంది. ఈ లెక్కన చూస్తే, ఈ రెండేళ్లలో అతనికి వచ్చిన లాభం రూ.56,65,500 - రూ.16,400 = రూ.56,49,100. ఇది నిజంగా అసాధారణ లాభమని చెప్పవచ్చు.


పెరుగుదల వెనుక కారణాలు

శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ స్టాక్ ధరలో ఈ భారీ పెరుగుదలకు అనేక కారణాలు ఉండవచ్చు. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కంపెనీ చేసిన వ్యూహాత్మక నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు లేదా మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ ఈ వృద్ధికి దోహదపడి ఉండవచ్చు. భారతీయ మీడియా రంగంలో డిజిటల్ కంటెంట్, OTT ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదల కూడా ఈ కంపెనీకి సానుకూలంగా ఉండవచ్చు.


మళ్లీ లాభాలు వస్తాయా..

ఈ స్టాక్ పెరుగుదలలో మార్కెట్ సెంటిమెంట్, స్పెక్యులేషన్, ఇతర బాహ్య కారకాల పాత్రను కూడా తోసిపుచ్చలేము. స్టాక్ మార్కెట్‌లో ఇటువంటి భారీ లాభాలు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, ఇవి ఎల్లప్పుడూ గ్యారెంటీ కాదని గుర్తుంచుకోవాలి. ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన వారు అద్భుతమైన లాభాలు పొందినప్పటికీ, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లాభాలు వస్తాయని చెప్పడం కష్టం. అందుకే పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, సమగ్రమైన పరిశోధన చేసిన తర్వాతే మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

గమనిక: ఆంధ్రజ్యోతి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు పెట్టుబడులు చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 01:47 PM