SLG Hospitals,: హైదరాబాద్‌లో 800 పడకల ఆస్పత్రి
ABN , Publish Date - Aug 14 , 2025 | 02:19 AM
హైదరాబాద్‌లోని నిజాంపేటలో 800 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి నిర్వహణపై ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజింక్యా డీవై పాటిల్ హెల్త్‌కేర్ వ్యూహాత్మక ఒప్పందం...
ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజింక్యా డివై పాటిల్ హెల్త్‌కేర్ భాగస్వామ్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : హైదరాబాద్‌లోని నిజాంపేటలో 800 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి నిర్వహణపై ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజింక్యా డీవై పాటిల్ హెల్త్‌కేర్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో హెల్త్‌కేర్ సర్వీసుల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయాలన్న ఉమ్మడి లక్ష్యంతో చేతులు కలిపిన రెండు సంస్థలు అందుబాటు ధరల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సంరక్షణ సేవలందించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపాయి. ఉభయ సంస్థలకు ఆయా విభాగాల్లో గల నైపుణ్యాలను జోడించి నిర్వహించనున్న ఈ ఆస్పత్రి క్రిటికల్, ఎమర్జెన్సీ కేర్; కార్డియాక్ సైన్సులు, ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. దశలవారీగా జరిగే ఈ అభివృద్ధి క్రమంలో ఒక్కో దశ అందుబాటులోకి వస్తున్న కొద్ది అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్ చైర్మన్ దండు శివరామరాజు తెలిపారు. ఉభయ సంస్థలు తమ పరిధిని విస్తరించుకుంటూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అజింక్యా డివై పాటిల్ హెల్త్‌కేర్ చైర్మన్ డాక్టర్ అజింక్యా పాటిల్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News