Share News

Silver Prices Surge and Plunge: వెండి ఉత్థాన పతనం

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:14 AM

వెండి ధరలు సోమవారం ఉత్థాన పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లోనూ సిల్వర్‌ ఫ్యూచర్స్‌ 2026 మార్చి కాంట్రాక్టు ధర ఉదయం ట్రేడింగ్‌లో...

Silver Prices Surge and Plunge: వెండి ఉత్థాన పతనం

  • ఆరంభ ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డు

  • రూ.2.54 లక్షలకు పెరిగిన కిలో ధర

  • ఆ తర్వాత గంటకే రూ.21,000 పతనం

ముంబై: వెండి ధరలు సోమవారం ఉత్థాన పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లోనూ సిల్వర్‌ ఫ్యూచర్స్‌ 2026 మార్చి కాంట్రాక్టు ధర ఉదయం ట్రేడింగ్‌లో రూ.14,387 (6 శాతం) మేర పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2,54,174కు ఎగబాకింది. కానీ, ఆ తర్వాత గంటలోనే ధర రూ.21,000 (8 శాతం) పతనమై రూ.2,33,120కి పడిపోయింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ వెండి రేటు తొలిసారిగా 80 డాలర్ల మైలురాయిని దాటి, ఒక దశలో 83 డాలర్లకు చేరువైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే 75 డాలర్ల స్థాయికి జారుకుంది. అందుకు కారణాలివీ..

  • సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి వద్ద ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటం ఽధర భారీగా పతనమవడానికి ప్రధాన కారణమైంది. ఎందుకంటే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి ధర 180 శాతానికి పైగా పెరిగింది. సంవత్సరాంతం కావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకునే ప్రక్రియలో భాగంగా లాభాలు స్వీకరించారని విశ్లేషకులు పేర్కొన్నారు.

  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మరో కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జరిపిన చర్చల్లో పురోగతి కన్పించింది. దాంతో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధానికి త్వరలోనే తెరపడవచ్చన్న ఆశాభావం మార్కెట్లో పెరగడంతో భౌగోళిక, ఆర్థిక అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న విలువైన లోహాలకు డిమాండ్‌ తగ్గింది.

Also Read:

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..

Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 30 , 2025 | 07:14 AM