Bullion Market Record Highs: వెండి కిలో లక్షన్నర
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:57 AM
బులియన్ మార్కెట్ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరో జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకాయి...
రూ.1.20 లక్షల చేరువలో పసిడి
వెండి ధర ఒకే రోజు రూ.7,000 పెరుగుదల
వారంలో రూ.19,050 అప్
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరో జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.1,500 పెరిగి రూ.1,19,500కు చేరిం ది. కిలో వెండి ధర ఒకే రోజు రూ.7,000 పెరిగి రూ.1.5 లక్షలను తాకింది. దీంతో గత వారం రోజుల్లోనే కిలో వెండి ధర రూ.19,051 పెరిగినట్టయింది.
బంపర్ లాభాలు
ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి మదుపరులకు బంపర్ లాభాలు పంచాయి. గత ఏడాది డిసెంబరు 31న రూ.78,950 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం ఇప్పటి వరకు రూ.40,550 (51.36ు) పెరిగి రూ.1,19,500కు చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.89,700 నుంచి రూ.60,300 (67.22ు) పెరిగి రూ.1.5 లక్షల రికార్డు స్థాయికి చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇదే కాలంలో ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా మదుపరులను నిరాశ పరిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల మేలిమి బంగారం సోమవారం హైదరాబాద్‌లో రూ.1,16,400 వద్ద, కిలో వెండి రూ.1.59 లక్షల వద్ద ట్రేడయ్యాయి. గత వారం 10 గ్రాముల మేలిమి బంగారం ఽధర తెలుగు రాష్ట్రాల్లోనూ (ప్రొద్దుటూరు) రికార్డు స్థాయిలో రూ.1.19 లక్షలకు చేరింది. విశాఖలో కిలో వెండి ధర గత వారం రికార్డు స్థాయిలో రూ.1.59 లక్షలు నమోదు చేసింది.
అంతర్జాతీయ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబరులో డెలివరీ ఇచ్చే బంగా రం ఔన్స్ (31.10 గ్రాములు) ధర సోమవారం రెండు శాతానికి పైగా పెరిగి 3,860.45 డాలర్లను తాకింది. ఔన్స్ వెండి ధర 2 శాతం పైగా పెరిగి 47.39 డాలర్లను తాకింది.
ఫ్యూచర్స్ మార్కెట్
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అక్టోబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల పసిడి ధర మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజిలో రూ.1,204 (1.06ు) లాభంతో రూ.1,14,992కి, డిసెంబరు కాంట్రాక్టు ధర రూ.1,034 (0.9ు) లాభంతో రూ.1,15,925కు చేరాయి. గత వారం రోజుల్లోనే ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర రూ.4,188 (3.77ు) పెరిగింది. డిసెంబరులో డెలివరీ ఇచ్చే కిలో వెండి ధర సోమవారం ఎంసీఎక్స్‌లో రూ.2,290 (1.61ు) లాభంతో రూ.1,44,179కు చేరి రికార్డు సృష్టించింది. వచ్చే ఏడాది మార్చి లో డెలివరీ ఇచ్చే కిలో వెండి ధర ఎంసీఎక్స్‌లో రూ.2,559 లాభంతో రూ.1,45,817ను తాకింది.
మరింత ముందుకే!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక పరిస్థితుల్లో ఎలాం టి మార్పులు కనిపించడం లేదు. దీంతో బంగారం, వెండి ధరలు రికార్డుల మీద రికార్డులు నమో దు చేస్తున్నాయి. ప్రస్తుతం 3,860.45 డాలర్లను బ్రేక్ చేసిన ఔన్స్ పసిడి ధర త్వరలోనే 4,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ప్రెషియస్ మెట ల్స్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోదీ అంచనా. అదే జరిగితే దేశీయ మార్కెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1.25 లక్షలకు, కిలో వెండి ధర రూ.1.75 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ వారాంతంలో బులియన్ మార్కెట్‌లో కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్ అమ్మకాలు జరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి