Share News

Silver Price Hike: వెండీ కొండెక్కె

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:52 AM

బంగారంతో పాటు వెండి కూడా కొండెక్కుతోంది. సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.1,000 పెరిగి సరికొత్త జీవితకాల...

Silver Price Hike: వెండీ కొండెక్కె

ఆల్‌టైం రికార్డు స్థాయికి కేజీ సిల్వర్‌ ధర..

హైదరాబాద్‌లో రూ.1.50 లక్షలకు చేరిక

న్యూఢిల్లీ: బంగారంతో పాటు వెండి కూడా కొండెక్కుతోంది. సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర గురువారం రూ.1,000 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1.40 లక్షలకు చేరింది. హైదరాబాద్‌ మార్కెట్లో ఇప్పటికే రూ.1.50 లక్షలకు పెరిగింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ కొత్త రికార్డును సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో డిసెంబరు డెలివరీ కాంట్రాక్టు ధర రూ.3,528 (2.63 శాతం) పెరిగి రూ.1,37,530కి చేరగా.. 2026 మార్చి కాంట్రాక్టు రేటు రూ.3,431 (2.53 శాతం) పెరుగుదలతో రూ.1,38,847కు ఎగబాకింది. అంతర్జాతీయంగా దీని ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ సిల్వర్‌ రేటు ఒక దశలో 45 డాలర్ల పైకి చేరి కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది.

ఈ ఏడాదిలో 56 శాతం అప్‌

గత ఏడాది చివరి నాటికి ఢిల్లీ మార్కెట్లో రూ.89,700 స్థాయిలో ఉన్న కిలో వెండి ధర.. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.50,300 (56 శాతం) పెరిగింది. ఒక ఏడాదిలో వెండి ధరలు 50 శాతానికి పైగా పెరగడం ఇదే తొలిసారి. గడిచిన పదేళ్లలో వెండికిదే అత్యధిక వార్షిక పెరుగుదల కూడా.

కారణాలివీ..

  • ట్రంప్‌ సుంకాలతో పెరిగిన అంతర్జాతీ యంగా వాణిజ్య అనిశ్చితి పెరగడం

  • ఫెడ్‌ రేట్లు తగ్గుతున్న సమయంలో డాలర్‌, యూఎస్‌ బాండ్ల రిటర్నుల రేట్లు తగ్గటం తో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తుండటం

  • పారిశ్రామిక రంగాల్లో, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల తయారీలో వెండి వినియోగం పెరగడం

  • దేశీయంగా పండగ సీజన్‌ గిరాకీ, రూపాయి క్షీణత కూడా వెండి ధరలను మరింత పైకి ఎగదోస్తున్నాయి.

  • పదేళ్లలో వెండి ధరల పెరుగుదల

సంవత్సరం కిలో ధర పెరుగుదల

(రూ.) (%)

2016 39,930 19.0

2017 38,425 -3.8

2018 38,245 -0.5

2019 46,665 22.0

2020 67,383 44.4

2021 61,979 -8.0

2022 68,092 9.9

2023 73,395 7.8

2024 86,017 17.2

2025 (ఇప్పటివరకు) 1,40,000 56.0

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 05:52 AM