Shireesh Chandra Murmu: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:50 AM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. అక్టోబరు 8వ తేదీ పదవీ విరమణ చేస్తున్న ఎం.రాజేశ్వరరావు స్థానంలో...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. అక్టోబరు 8వ తేదీ పదవీ విరమణ చేస్తున్న ఎం.రాజేశ్వరరావు స్థానంలో ముర్మును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి డిప్యూటీ గవర్నర్‌గా ఆయన నియామకానికి నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆర్‌బీఐ చట్టం 1934 కింద ఆర్‌బీఐలో నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. వారిలో ఇద్దరిని అంతర్గతంగా ఆర్‌బీఐ నుంచి ఎంపిక చేస్తారు. ఒకరిని వాణిజ్య బ్యాంకింగ్ రంగం నుంచి ఎంపిక చేసి మరొక డిప్యూటీ గవర్నర్‌గా ఆర్థికవేత్తను నియమిస్తారు. ప్రస్తుతం టీ.రబిశంకర్, స్వామినాథన్.జే, పూనమ్ గుప్తా ఇతర డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. సూపర్‌విజన్ శాఖలో ఆయనకు గల విస్తృత అనుభవం ప్రస్తుత అంతర్జాతీయ అస్థిరతలు, దేశీయ సంస్కరణల నేపథ్యంలో దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులంటున్నారు.
ఎంపీసీ సమావేశం షురూ: రాబోయే రెండు నెలల కాలానికి అనుసరించాల్సిన ద్రవ్యపరపతి విధానాన్ని నిర్ణయించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమయింది. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణ కదలికలు, అంతర్గత/విదేశీ ఒత్తిడులపై సమీక్షించి ద్రవ్య విధానాన్ని రూపొందిస్తారు. 3 రోజుల సమావే శం అనంతరం బుధవారం మల్హోత్రా ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి